Sunday, 29 August 2010

"కామన్"వెల్త్ -- లింగరాజు క్లాస్ పీకుడు..

సింగ :- ఒరే , కొద్దిరోజుల్లో కామన్వెల్త్ గేములు మొదలవుతాయి గదా , వెల్దామేంటి?

లింగ :- ఎందుకురా?


సింగ :- ఎందుకంటావేంటిరా !! దేశదేశాల క్రీడాకారులొస్తారు , మన దేశ స్టార్స్ వస్తారు .. మన సైనా , అభినవ్ బింద్రా , ఇలా అందర్ని చుడొచ్చు గా ...


లింగ :- మనోళ్ళన్నావ్ ఒప్పుకుంటాను ... కాని మిగతా స్టార్స్ ఎవ్వరూ రావట్లేదు ..


సింగ :- అదేంటి ?


లింగ :- ఆట మధ్యలో ఏ పైకప్పో ఊడి పడిపోతే ? గట్టిగా వానొచ్చి ఆ వరదల్లో కొట్టుకుపోతే ? ఎవరి భయాలు వాళ్ళవి !!

సింగ :- నువ్వు మరీనురా ... ఏదో ఒకసారి జరిగితే అస్తమానూ జరుగుతుందా ఏంటి? పైగా మన దేశంలో జరిగేదానికి మనమే వెళ్ళకపోతే , పరాయి దేశాల వాళ్ళ ముందు మన పరువుమనమే తీసుకున్నట్టు ఉండదా ? అది మన బాధ్యత కాదా? మన కుటుంబంలో తప్పు జరిగితే , మనలో మనమే చూసుకోవాలి గాని .. ఇలా రచ్చకెక్కకూడదుగా ...



లింగ :- బాధ్యతా? ఏరా మొన్న జరిగిన ఎలెక్షన్లలో ఓటేసావా?


సింగ :- అంటే .. అర్జెంట్ పని వల్ల , బూత్ కెళ్ళ లేకపోయాను రా !!


లింగ :- మరి ఇంకేం బధ్యత రా .. ఓటెయ్యడానికి లేని బాధ్యత , ఆటలకి వెల్తే మటకూ నిలబడుతుందా? నీలాంటి వాళ్ళవల్లే , ఇప్పుడు దేశం పరువుపోతోంది ..




సింగ :- ఏంటి దేశం పరువు తీసేసానా ? నేనా? పిచిగాని ఎక్కిందేంటిరానీకు ? నా ఒక్క ఓటుకి దేశం పరువుకీ సంబంధం ఏంటి  ..

లింగ :- అదే .. నువ్వు వెయ్యవు , నిన్ను చూసి నీ పక్కోడుకూడా నాకెందుకు అనుకుంటాడు .. ఇలా అందరూ అనుకోబట్టే , ఈనాడు చేతగాని వాళ్ళందరూ అందలం ఎక్కి, ఇస్టం వచినట్టు , స్కాములు చేసేసి దేశం పరువు తీసేస్తున్నరు.. 35,000 కోట్లు ఖర్చు పెట్టి , కూలిపోయే స్టేడియాలు,నాసిరకం వసతులు , ఇంకా పూర్తి గాని పనులూనా ? ఒక పక్క ఒలింపిక్స్ కి మన పక్క దేశం, చైనా , ఎంత బాగా జరిపింది ... ఆఖరికి "డార్క్" ఖండం ఆఫ్రికా కూడా మొన్న సాకర్ వరల్డ్ కప్ నువ్వా నేనా అన్నట్టు చేసింది .. నూరు కోట్ల జన సంపద ఉన్న మన భారతానికి ఎమిట్రా ఈ దౌర్భాగ్యం... ఇంత జరిగినా , స్కాములు చేసిన మంత్రులూ బాగనే ఉన్నారు .. వాళ్ళని నడిపే "అమ్మలు" కూడా బానే ఉన్నారు .. మన ఆత్మగౌరవమే , చేతగాని నాయకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది ... ఢిల్లీ నగరం ఇప్పటికే ఒక్క వానొస్తే సముద్రమైపోతోంది , ముందు దాన్ని బాగుచెయ్యకుండా , గేములకొచ్చే వాళ్ళ "టిష్యూ పేపర్"లకి 4 కోట్లు , .. ఎమైనా అంటే గేములవ్వనివ్వండి , పరువు తియ్యకండి అనడమా? పరువు ఎవరు తీస్తున్నార్రా ?

సింగ :- ఆటలకి వెల్దామన్న ఒక్క మాటకి ఇంత క్లాసు పీకుతావా ... ఇది ఘోరం .. నేను ఖండిస్తున్నా ..



లింగ :- ఖండించటం కన్నా , నువ్వూ నేనూ , ఇంకేం చెయ్యగలంలేరా ..


సింగ :- ఒక్కటి చెయ్యగలమేమోరా !!


లింగ :- ఏంటది? సమ్మెలు చెయ్యడమా ? అవి వాళ్ళని ఏమీ చెయ్యవు , దున్నపోతు మీద వాన పడ్డట్టు , మన నోరునొప్పి తప్ప ..


సింగ :- కాదు !! వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఒటెయ్యడం !!


లింగ :- చూద్దాం .. కాని వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయ్ ..వారసులు అనే బ్రహ్మాస్త్రం ఉందిగా..దానికి తగ్గట్టు గా తగిన "కోచింగ్" కూడా నడుస్తోంది


సింగ :- అరెరే !! నిజమే కదా !!

No comments:

Post a Comment