"కందువగు హీనాధికములిందు లేవు,
అందరికి శ్రీహరే అంతరాత్మ..
ఇందులో జంతు కులమంతానొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ.."
దూరంగా అన్నమాచార్య కీర్తన వినిపిస్తూంటే , మన సింగ రాజు సైకిల్ మీద ఈలేసుకుంటూ గోదారి గట్టున ఉన్న చింతచెట్టు దగ్గరకి వెళ్తున్నాడు .
అప్పటికే మన లింగ రాజు అక్కడకొచ్చేసి ఎప్పటిలానే ఏదో ఆలోచించటం మొదలు పెట్టేసాడు ..
సింగ :- ఎమ్రో ! అప్పుడే ఏదో ఆలోచించేస్తున్నావ్ ! మన శెట్టి గారి అప్పు ఎలా ఎగ్గొట్టాలనా?
లింగ :- ఏడిసావు లే గాని , నా మనసేమి బాగోలేదు ఈ రోజు నన్నేమి మాట్లాడించకు ..
సింగ :- ఎమైందిరా , ఎవరేమన్నారు?
లింగ :- ఎవరో ఎదో అన్నారని కాదు , ఎం , నాకు మనుసుండదా , నాకు బాధ రాకూడదా ?
సింగ :- ఒరే ఒరే ! ఆగు , ఇంత బాధ పడుతున్నావంటే ఎదో జరిగింది .. ఎమైంది..
లింగ :- ఛీ , ప్రశాంతంగా బాధ కూడ పడనివ్వరు కదా .. సరే విను ... ఈ రోజు నా మావయ్య కొడుకు పట్నం నుంది వచ్చాడు , ఎంత డాబు , ఎంత దర్పం అనుకున్నావ్ .. వాడి ముందు నా వాలకం చూసి అందరూ నవ్వారు తెలుసా , మనం కూడా పట్నం లొ చదివి ఉంటే ఇంకా గొప్ప గా ఉండే వాళ్ళం ఎమో .. చాలా చిన్నతనం అనిపించింది , అందుకే ఇక్కడకి ఇంత త్వరగా వచ్చేశాను ...
సింగ :- ఓరినీ ... ఇదా సంగతి ..
లింగ :- నీకు చెప్పుకున్నానని అలుసైపొయానా? , ఇది నీ దాకా వస్తే తెలుస్తుంది , ఎంత పెద్ద సంగతో...
సింగ :- అలా అని కాదురా లింగం , సరే , కొన్నేళ్ళ క్రితం మన ఊరొచ్చిన ఓ స్వాములోరు చెప్పిన కధ చెప్తాను విను
లింగ :- ఎవరూ ఆ పెద్ద స్వాములోరా?
సింగ :- ముందు కధ వినెహై ... పూర్వం సృష్టి చేస్తున్న చతుర్ముఖుడి దగ్గరకి..
లింగ :- తెలుగు లో చెప్పెహై ..
సింగ :- ఖర్మ ! బ్రహ్మ దేవుడి దగ్గరకి రెండు ఇసుక రేణువులొచ్చి .. "అయ్యా , మాకు కూడా ప్రపంచం లో పెద్ద స్థానం ఇవ్వండి ప్రభూ " అని కోరుకున్నాయి ..
లింగ :- ఇసుక రేనువులు , పెద్ద స్థానమా? కామెడీ !!
సింగ :- లింగం .. కధ విను ..
లింగ :- చెప్పు చెప్పు
సింగ :- ఆ పెద్దాయన అప్పుడు , " సరే" అని , రెండిటిని మన భూమ్మీద పడేసి , సరిపడంత నీరు , మట్టి , గాలి ఇచ్చి , "మీ ఇష్టం వచినట్టు ఎదగండి " అనేసి వెళ్ళి పొయాడు .. అలా కొన్ని వందల ఏళ్ళు ఐపొయాయి..
వాటిలో ఒక ఇసుక కణం , ఎన్ని కష్టాలొచ్చీనా తట్టుకుని , తనకిచ్చిన గాలి తో ఇంకొన్ని ఇసుక కణాలు పొగేసుకుని , ఆ మట్టి , నీరు అన్నిటి తో కలుపుకుంటూ , నెమ్మదిగా , పెద్దగా , ఎదిగి ఒక పర్వతమైపొయింది ...
లింగ :- నీరు ,మట్టి కలపడం ఏంటి , పర్వతమవ్వడమేంటి ... నాకర్ధం కాలేదు , ఎదొ లాజిక్ లేనట్టుందే..
సింగ :- అంత లాజిక్ తో చెప్పడానికి , నెనేమన్నా సైన్సు పాఠం చెబుతున్నానా ? యక్ష ప్రశ్నలాపి కధ విను ..
లింగ :- ఎం ప్రశ్నలు ?
సింగ :- కధ విను బే !
లింగ :- ఓ.కె
సింగ :- ఎక్కడున్నాం ? ఆ , అది అలా పర్వతమవ్వగా , రెండో ఇసుక రేణువు , ఆ పెద్దాయన ఇలా వెళ్ళగానే మహా హుషారుగా , పని మొదలు పెట్టింది ... కొన్నాళ్ళు బానే నడిచింది .. ఈ లోగా చిన్న తుఫాను రావటం అప్పటిదాకా పేర్చుకున్న కుప్ప కాస్తా ఎగిరిపోవటం , మళ్ళ్ళీ మొదలు పెట్టడం , ఇలా కొన్ని సార్లు జరిగేసరికి , నీరసించిపొయి , ఇంక మనవల్లేం అవుతుంది లే , అని పక్కనే పర్వతంగా ఎదుగుతున్న ఇసుక రేణువుని చూస్తూ , తన అదృష్టాన్ని తిట్టుకుంటూ .. ఇసుక రేణువు గానే మిగిలిపోయింది ..
లింగ :- అంటే , నెను ఆ రెండో ఇసుక రేణువునంటావ్ ?
సింగ :- నువ్వే కాదు రా , మనం మన స్వశక్తిని నమ్మనంత కాలం అందరం ఆ రెండో ఇసుక రేనువు లాంటి వాళ్ళమే
లింగ :- బాగుంది రా , సమయానికి నా శక్తి గురించి గుర్తు చేసి , నన్ను డిప్రెస్ అవ్వకుండ కాపాడావు.. ఇంత మంచి కధ ని ఆ పెద్దస్వాములోరే చెప్పారా? అప్పుడెం మాట్లాడినట్టు గుర్తులేదే ..
సింగ :- లేదు
లింగ :- మరెవరు చెప్పర్రా?
సింగ :- మనమే !!!
లింగ :- వార్నీ....
adirindi. :)
ReplyDeleteభలే!
ReplyDeleteచివర్లో ట్విస్టు సూపరు
@ vinay and Kottapaali , thanks andi :-)
ReplyDelete