ఒక అపరాహ్నవేళ ...
సుష్టుగా భోజనం చేసి ... నోటి నిండా కిళ్ళీ వేసుకుని.. ఏ లోకోత్తరమైన విషయం మీద చర్చిద్దామా అని మన రాజులిద్దరూ సమాలోచనలు జరుపుతున్న సమయం...
దూరంగా , ఆకాశవాణి లో "గోదారి గట్టుందీ ..." అనే పాత పాట వినపడుతూంటే , ఆ సంగీతానికీ ఆ సాహిత్యానికీ పరవశులయ్యి .. నములుతున్న కిళ్ళీలు ఐపొతే , తాపీగా చుట్ట వెలిగించుకుని , ఆకాశం కేసి చుస్తూ..
సింగ :- ఆహా ! ఎంత మంచి సంగీతం రా లింగా ! మనసులోంచి వచినట్టుందిగా ..
లింగ :- మరే ! ఆ సాహిత్యం చూడు , మనసుకి హత్తుకునేలా లేదు..
సింగ :- అవున్రా లింగం ! ఎంతైనా సంగీతానికి సాహిత్యానికి ఉన్న శక్తి మరేదానికీ లేదంటాను .. ఏమంటావ్?
లింగ :- రైటైన మాటన్నావ్రా సింగా ! మనసు తేలిపొతుందనుకొ ... అవును నీకు సంగీతం అంతే ప్రాణం అనుకుంటా , ఏవో రెండు మూడు నాటకాలలో హార్మోనియం కూడా వాయించినట్టున్నావ్ ?
సింగ :- మరే ! నీకు కూడ సాహిత్యమంటే ఇష్టం అనుకుంటా ?
లింగ :- కరష్ట్ !
సింగ :- ఐతే , నేనొక రాగం వదులుతాను , ఆశువుగా పాటనల్లగలవా?
లింగ :- నేను రెడీ ! నువ్వు నా సాహిత్యానికి తగ్గ స్వరాలు అందించగలవా ?
సింగ :- అబ్బో , సరే ఐతే కాసుకో ... జై కె .వి. మహదేవన్ గారు ..
లింగ :- జై సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు...
సింగ :- "తన తాన నాన .. తన తాన నాన ..తానాన నాన తాన తాన తందానా .."
లింగ :- "తన తాన నాన .." ఇదెక్కడో విన్నట్టుందే ... ఆ .. "కన్నె పిల్లవని కన్నులున్నవని , ఎన్నెన్ని కలలు కంటున్నావే చిన్నారీ " ... ఈ పాట కదూ , దొంగ నా "___" ... కాపీ కొట్టి నీ సంగీతం అని చెప్పేసుకుంటావా?
సింగ :- ఏం మన మ్యూజిక్ డైరెక్టర్లు ఇదే పని చేస్తే , సూపర్ అంటావా? నేను చెస్తే తిడతావా? పాట కట్టలేను అని చెప్పరా , ఈ కబుర్లన్నీ ఎందుకూ ?
లింగ :- అంత మాటంటావా ? చూడరా తెలుగు పారడీ పవర్ చూపిస్తాను...
"కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని కలలు కంటున్నావే చిన్నారీ "
" పల్లవి :- పీఠమున్నదని , అడ్డు లేదు అని , ఎన్నెన్ని స్కాములు చెసేస్తావు ఓ మంత్రీ ...
నోటు పుచ్చుకుని , నిన్ను ఎన్నుకుని , తప్పు చేసిందిక మేమేలేవో మా మంత్ర్రీ ...
దుర్మాగం నీదైతే ...
దౌర్భాగ్యం మాదంటా ... " ||పీఠ||
"కవిని నేనై ... నాలో కవిత నువ్వై ..."
చరణం :- బలుపు నీదై .. నీ బలి పశువు మేమై ...
కంచే.. చేనుని.. మేస్తే
ఓటు మేమై ... మా వెన్నుపోటు నువ్వై ...
నీ దురాశకే ...పుడమే.. జడిసీ ...పోయే ... "
సింగ :- భలే భలే ! బాగా రాశావ్ ....
లింగ :- మరేమనుకున్నావ్ .. సంగీతం కాపీ కొట్టినా , సాహిత్యం లో మనకు మనమే సాటి ... ఒక్క వేటూరి పాట చాలు , తెలుగు సాహిత్యం తియ్యదనం రుచి చూడటానికి..
సింగ :- బాగుంది ... ఇలాంటి మెలొడీలేనా , లేక ఫాష్ట్ పాటలకి కూడా పారడీలు కడతావా ?
లింగ :- దేనికి కట్టమంటావ్ ?
సింగ :- నాగర్జున , "రక్షకుడు" సినిమా లొ నా ఫావరైట్ ..
" సోనియా సోనియా ...స్వీటు స్వీటు సోనియా ..
రేగుతోందె లేత వయసు జోరూ ...
ఘాటు లవ్వు రెండు టైప్సు .. నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నీకు ప్యారూ .."
లింగ :- ఓహో ! కొంచెం కష్టమే ...
సింగ:- ఐతే ఓడిపొయావా?
లింగ :- కష్టమన్నా గాని , చెయ్యనన్నానా? ఊ .. హూ... ..................ఆ.. కాస్కో ..
" సోనియా సోనియా ...సీటు సీటు సోనియా ..
ఇవ్వవమ్మ కాసులిచ్చు సీటు ..
కామన్వెల్త్ గేములైన .. ఖనిజ గనుల స్కాములైన..
మాకు అవే వేల వేల కోట్లూ .. "
సింగ:- శెభాష్ !!
లింగ :- థాంక్యూ !!

శెభాష్..
ReplyDeleteబాగుంది రోయ్ :)
ReplyDelete:)
ReplyDeleteSuper
ReplyDeleteబ్రిలియంట్!
ReplyDeleteమీ కీబోర్డు పదునెక్కుతోంది.
సింగ లింగ రాజులు ఇలాగే దినదినాభివృధ్ధి చెందాలని ఆశిస్తున్నా
mee andariki nachinanduku chaala santosham ... @kotta paali , thanks andi mee wishes valla maa vaalliddaru inka rocket la doosukupotaaranukuntaa..
ReplyDelete