జగన్నాటక సూత్రధారి కంసవధ కోసం , కురుక్షేత్ర సంగ్రామంలో పార్ధసారధిగా పరమార్ధం బోధించటం కోసం , దేవకీ గర్భాన, కారగారంలో,రాక్షసులు తిరిగే నిశా సమయంలో , తనని తానే సృజించుకున్న శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ..
తమ వీధిలో పెట్టిన ఉట్టి కొట్టొచిన ఆనందం లో లింగరాజు ఉంటే , మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు సింగ రాజు ..
లింగ :- ఏరో ! ఎమైందేంటి , మొహం రాజమండ్రి బ్రిడ్జి గతుకులలో , డొక్కు ఆటో లో కుక్కుకుని వచ్చిన వాడిమల్లే పెట్టావ్ , ఏంది కథ ?
సింగ రాజు భారంగా నిట్టూర్చాడు ..
లింగ :- ఏంటి నిరాశే? అయితే నీకు రెండు ఇసుక రేణువుల కధ చెప్తా నిరాశ పోతుంది , పూర్వం బ్రహ్మా...
సింగ :- రే ! ఆపరా , అది నేనే నేకు చెప్పాను..
లింగ :- ఓహో! నువ్వు చెప్పిందేనా అది , మర్చిపొయా :-)
సింగ :- అయినా సందర్భం ఏంటో తెలియకుండా అన్నిటికీ ఆ కధే చెప్పేస్తావా ?
లింగ :- ఏమో , నువ్వు కూడా ఆత్మనూన్యతతో ఉన్నావేమో అని అనుకున్నా .. మరెందుకిలా ఉన్నావ్? ఆ కరణం గారి అమ్మాయి, నీ ప్రేమ తిరస్కరించిందా?
సింగ :- ఊహూ ..
లింగ :- మరైతే , వాళ్ళ నాన్నకి చెప్పేసిందా? చెప్పరా బాబు కొన్నాళ్ళు నీతో తిరగడం మానేస్తాను.. తిక్కచచ్చినోడు నన్ను పట్టుకుని వాయించేస్తాడు..
సింగ :- కాదెహై !
లింగ :- కొంప తీసి ఒప్పేసుకుందా ఏంటి , ఇంత బాధ పడుతున్నావ్..
సింగ :- అదేమి కాదు రా బాబు .. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో .. ఒక బొండం తాగి వందిస్తే , ఇచ్చిన చిల్లరలో ఒక పది నోటు చిరిగిపోయిందొచ్చింది ..
లింగ :- ఆరి పిసినారోడా ! ఒక్క చిరిగిన నోటుకి ఇంత నిరాశా ?ఎవడు మన బొండాంసత్తిగాడేనా ఇచ్చింది, వాడినే అడుగు ఇంకోటి ఇవ్వమని ..
సింగ :- వాడు కాదు , వీడెవడో కొత్తోడు ,ఆనక బాబాయి హోటల్లో టిఫిన్ తిని బిల్లు కడుతూంటే అప్పుడు గమనించా .. ఆ బొండాలోడి కోసం ఊరంతా తిరిగా , లాభం లేదు దొరకలేదు..
లింగ :- మరేం చెసావ్?
సింగ :- అది మారుద్దమని మన శెట్టి కొట్లో అవసరం లేకపొయినా , పప్పు , ఉప్పు కొనేసి , తెలివిగా , మిగతా నోట్లతో పాటూ ఇది కలిపేసి ఇచ్చేసాను .. కాని ఆ శెట్టిగాడు పట్టేసాడు ...
లింగ :- డబ్బువిషయంలో వాడంతేగా .. ఆ తర్వాతా?
సింగ :- ఇంకో రెండు మూడు కొట్లలో ఇలా అవసరం లేక పొయినా ఎదో ఒకటి కొని ఇది మారుద్దమనుకున్నా , కాని లాభం లేదు , ఎవ్వడూ తీస్కోలేదు ..
లింగ :- మరి ?
సింగ :- ఇంక ఉక్రోషం ఎక్కువైపోయి , ఎలాగోలా దాన్ని వదిలించుకోవాలని చెప్పి , మన బస్ స్టాండ్లో ఎవరు చుడకుండా పడేసా..
లింగ :- పొన్లే , ఒదిలిపోయిందిగా..
సింగ :- ఏంటి పోయేది , వెనకాలే ఎవడో పరిగెత్తుకుని వచ్చి మరీ "సార్ మీ నోటు పడిపొయింది సార్" అని ఇచ్చి వెళ్ళాడు .. బహుశా దొంగలకి కూడా ఆ చిరిగిన నోటు అక్కర్లేదేమో ..
లింగ :- ఒరినీ ఇదా నీ ప్రాబ్లం .. నోటుని గోదాట్లో వేసెయ్యి.. సరిపోతుందిగా ..
సింగ :- అదే అనుకున్నాను , కాని మన గోదారి గట్టున ఉన్న కృష్ణుడి గుడి గంట వినపడే సరికి ఒక ఐడియా వచ్చింది .. మెల్లగా వెళ్ళి , హుండీ లో వేసేసి ప్రసాదం కడుపునిండా తినొచ్చాను
లింగ :- బాగుంది రా .. మరేం , అది ఒదిలిపోయింది గా , ఇంకెందుకు ఈ దిగులు ..
సింగ :- అసలు గొడవ ఇక్కడే మొదలయింది
లింగ :- పశ్చాత్తాపమా ?
సింగ :- అంతలేద్రో ! అలా హుండీలో వేసొచ్చానో లేదో , ఇలా మన పోస్టుమాన్ వచ్చి , మా మవయ్య పంపిన పదివేల మనీ ఆర్డర్ ఇచ్చి పోయాడు .. పూర్వం , మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడంట , ఇప్పుడది వడ్డీతో కలిపి పదివేలయ్యిందని , ఆలస్యమయినందుకు క్షమించమని రాసి పంపాడు..
లింగ :- వార్నీ ! మరేమనుకున్నవ్ కృష్ణుడంటే .. అటుకులిస్తేనే పొంగిపోయి ఐశ్వర్యమిచ్చాడంటే నమ్మలేదు నువ్వు .. ఇప్పుడు చూడు .. ఐనా సంతోషించకుండా , ఇంకా ఏడుపు మొహం ఏంటిరా?
సింగ :- చిరిగిన నోటేస్తేనే పదివేలిచ్చాడంతే .. మామూలు నోటు వేసి ఉంటే ఇంకెంత వచ్చి ఉండేదో అని .. ఛాన్స్ పొయిందే అని బాధ..
లింగ :- ఓరి నీ ఆశ !! కృష్ణ కృష్ణ !!

బాగా నవ్విస్తున్నారు.
ReplyDeleteమీరు రాసినవన్నీ ఇప్పుడే చదివాను. బాగా నచ్చాయి.
సమ్ వన్ టు లిజన్ మీ కవితనా? కదిలించేలా ఉంది.
@mandakini .. ee rendu blogs lo unna kavitalu ani naavey andi .. meeku nachinanduku chaala santosham andi ...
ReplyDeleteకథకి కొసమెరుపు చాలా బాగుంది. కడుపుబ్బ నవ్వించింది.
ReplyDeleteతెలుగు అనువాదాలు గారు ,
ReplyDeleteకృతఙ్ఞతలండి