Thursday 3 May 2018

అమెరికాలో పద్యనాటకం



Youtube Link of the Play :

మౌర్యచరితం ( ప్రవాసంలో పద్యనాటకం )



దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వమే "పాత" అని ముద్రవేయించుకుని చలనచిత్రాల తాకిడికి కొంత ధృతి తగ్గి కొన్ని సందర్భాలకే పరిమితమైన నాటకం, అందునా పద్యనాటకం , ప్రవాసంలో ఈమధ్య మళ్ళీ పునరుజ్జీవం పొందుతోంది 

ఈనాటి లఘుచిత్రాల కాలంలో మళ్ళీ పద్యనాటకాలు ఆదరణకు నోచుకోవడం మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తార్కాణం అనుకోవచ్చేమో ..

పద్యాన్ని అమెరికాలో ఉన్న మన తెలుగు పిల్లలకు ఎలా చేరువ చేయవచ్చు అనే ఆలోచనకు జవాబుగా 2017 లో  ఓర్లాండో నగరంలో మొదటిసారిగా టాగో ఉగాది వేదికపై ప్రదర్శించిన "భువనవిజయం " రూపకంతో మొదలైన ఈ నా పద్యనాటక  ప్రస్థానం , ఓర్లాండో , తలహాసీ , చికాగో ప్రేక్షకుల ఆదరణతో చక్కగా కొనసాగుతోంది .. అంతా శ్రీమాత దయ !

అందులో ముందుగా ఈ మధ్యే ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం మీ అందరి ఆశీర్వాదంకోసం పైన youtube లింక్ లో ఉంది ... ఆనందించండి , ఆశీర్వదించండి 

                          తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి  ( Kalyan Tatavarthy )