సింగ రాజు & లింగ రాజు ఇద్దరూ ప్రాణ స్నేహితులు .
నిక్కర్లేసుకునే కాలం నుంచి ఇప్పటి దాకా మనస్పర్ధలే రాలేదు వీరి మధ్య ( ఎందుకంటే 80 % ఒకడు చెప్పేది ఇంకోడికి అర్ధం కాదు కాబట్టి !!).
షొలే సినిమా చూసి అమితాబ్ & ధర్మేంద్ర లా ఊహించేసుకుని గబ్బర్ సింగ్ కోసం తూర్పు & పశ్చిమ గోదారి జిల్లాల్ని సైకిళ్ళేసుకుని చుట్టొచ్చి , ఎవరూ దొరక్క తమ ధాటికి పారిపొయాడనుకునే వీరి వాలకం చుస్తే , పరమనందయ్య శిష్యుల్లో ఇద్దరు మళ్ళీ పుట్టారేమో అనుకుంటరెవ్వరైనా.
ఆలాగని వీరి మాటలను మరీ తీసి పారెయ్యలేం , వీళ్ళకి తెలియకుండానే కొన్ని నిజాలు కుండ బద్దలు కొట్టెసేలా చెఫ్ఫేస్తారు .. ఇలా ఎన్ని కుండలు బద్దలయ్యాయో ఉభయగొదావరి జిల్లల్లో లెక్కే లేదు.
వాళ్ళ "ఇంటెలెక్చువల్ డిస్కషన్" ని ఇలా బ్లాగ్ లొ పెడతానని నేను వాళ్ళని అడగటానికి వాళ్ళ ఊరు వెళ్ళా ... అదే మన కధ కి మొదలు ....
నేను :- నమస్తే సింగ రాజు గారు , నమస్తే లింగ రాజు గారు ..
సింగ :- "నమస్తే"
(లింగ రాజు గారు తనని కానట్టు ఏదో దీర్ఘాలొచన లో మునిగి ఉన్నారు)
సింగ :- ఒరేయ్ లింగం , నమస్కారం చెయ్యరా , నమస్కారనికి ప్రతి నమస్కారం , సంస్కారం .
లింగ :- "ఇదిగో నమస్కారం తీసుకొవయ్యా" అని నాకొక దండం పెట్టి, సింగ రాజు గారికేసి తిరిగి అదికాద్రా సింగా , అసలు సంస్కారం అంటే ఏంట్రా ?
సింగ :- నలుగురిలో ఒక పద్దతి గా నడుచుకోవటం.
లింగ :- అంటే?
సింగ :- అంటే, పెద్ద వాళ్ళని గౌరవించటం , తిట్లూ బూతులూ అందరి ముందూ మాట్లాడక పోవటం ఇలాగన్నమాట ...
లింగ :- ఒహో ! అయితే మన ఊరి MLA కి లేనిదే ఈ సంస్కారమన్నమాట !!
సింగ :- అదేంట్రా?
లింగ :- అసెంబ్లీ లో మాట్లడటం వినలేదా, నోరు తెరిస్తే కంపే కంపు ... ఏ స్కూల్లో చదివాడో తెలుసుకుని ఆ స్కూలుకి పంపించను నా పిల్లల్ని ..
సింగ :- పిల్లలా? పెళ్ళే కాలేదు కద రా నీకు
లింగ :- అమ్మాయి దొరకాలి కదా..
సింగ :- నీ మొహం !! నా మాట విని తొందరగా చెసుకో , లేకపొతే భవిష్యత్తు లో అవ్వదు
లింగ :- ఏ ? డిసెంబరు 2012 కి పోతామనా?
సింగ :- నీ మొహం
లింగ :- ఆ మధ్య వచ్చిన సినిమా లో ఇదే చూపించారు గా
సింగ :- అదేమి కాదు , ఆడ పిల్లల సంఖ్య తగ్గిపొతోంది, తెలియదా?
లింగ :- ఇదేం గొడవ రా బాబు .. వీళ్ళు కూడా అంతరించిపోతారంటవా? ఏంటో ఈ కష్టాలు... మరి నాయకులు , పెద్దవాళ్ళు , మేధావులు ఎం చేస్తున్నార్రా?
సింగ :- వాళ్ళేం చెస్తారెహై ! వాళ్ళకి పెళ్లిళైపోయుంటాయి
లింగ :- ఔన్రా సింగా !! ఇదేదో ఆలోచించాల్సిన విషయమే..అవున్రా మరి అతిథులొచ్చినప్పుడు , వారిని అవమానించి పంపడం కుడా సంస్కారమేనా ?
సింగ :- అది సంస్కారేమేంటి? పొగరు .. ఇప్పుడు ఎవరు ఎవర్ని అవమానించార్రా ..
లింగ :- నువ్వు కూడ మన విదేశాంగ మంత్రి లా మాత్లడుతున్నావే..
సింగ :- వాడెవడెహై ..
లింగ :- ఫారిన్ మినిస్టర్రా బాబు ...
సింగ :- అది అలా చెప్పు ..
లింగ :- ఖర్మ ! సరేలే , ఈ మధ్య మన పక్కదేశానికి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు , నలుగురు ముందు ఎలా మాట్లడారో చుసావు గా ..
సింగ :- మన వాడేం వెలగ పెట్టాడో !
లింగ :- అవన్నీ పక్కన మాట్లాడుకొవాలి గాని , మాటలకి అని పిలిచి ఇలా చెయకూడదు కద రా ..
సింగ :- అయినా , ఆ మంత్రి కి లేని బాధ నీకెందుకు రా , మన మన్మోహన్ సింగ్ అన్నా తర్వాత మాట్లడాడు కాని ,ఈ మంత్రి కిమ్మనలేదు చూసావా ..
లింగ :- ఏం చెస్తాము రా , పిల్లనిచ్చాక ఇవన్ని తప్పుతాయా !!
సింగ :- పిల్లనిచ్చామా? ఎవరు ?
లింగ :- ఎంటెహై తెలియనట్లు మాట్లడతావు , మొన్నే గా మన సానియా ని వాళ్ళబ్బాయి కి ఇచ్చి చేశాం
సింగ :- ఓహో అలా వచ్చవా !!
అని అప్పటికి నెనున్నాను అనే విషయం గ్రహించి , ఏం కావాలి అన్నట్టు చూశారిద్దరూ..
"నమస్తే !! నేను మీ సాయం కోసం వచ్చాను ..ఏం లేదండీ మీరు ఒప్పుకుంటే మీ కబుర్లను నా బ్లాగ్ లో పెడతాను" అని నా మాట విని.. చిద్విలాసంగా నవ్వుతూ ఒప్పుకున్నారు -- courtesy సింగ రాజు & లింగ రాజు

బాగుంది :)
ReplyDeleteనాకూ ఎదురయ్యారు ఇలాంటి జంటలు
Thanks andi
ReplyDelete