Friday, 20 August 2010

ఒక కొత్త "ఇజం"


సింగ :- ఒరే లింగం ! దేశం లో ఒక కొత్త "ఇజం" మొదలైంది తెలుసా ..

లింగ :- ఇంకో కొత్త "ఇజమా" , ఇప్పుడేం మొదలైంది ?

సింగ :- "కన్వర్షనిజం "

లింగ :- పేరు బాగుంది ! కాని ఏంటిది?


సింగ :- తెలీదా ! ఎప్పటినుంచో ఉన్నదే , మతమార్పిడులు .. ఒకప్పుడు , గుట్టుగా జరిగేవి .. ఇప్పుడు  "పెద్దల" అందదండలతో మహ జోరుగా జరుగుతున్నాయిలే


లింగ :- అవున్రో విన్నాను ! అంతెందుకు మన దానయ్య లేడూ , వాడేరా కరణం గారి పాలేరు కొడుకు ,ఉద్యోగం అని పట్నానికి  వెళ్ళి , "ధర్మపాదం" గా తిరిగొచ్చడు .. మతం మారినందుకు 10,000 ఇచ్చారంట , విదేశాలనుంచి దబ్బులొస్తాయంట , అన్ని సౌకర్యాలూ ఉంటాయంట .. వీడు చెయ్యల్సిన పనల్లా , వీడిలా అందరిని మతం మార్పించడం ...

సింగ :- ఇదే మరి నేటి కొత్త "ఇజం" ..



లింగ :- ఎప్పుడో మొదలైనవేగా ఈ మార్పిడులు .. ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేం , పైగ "ఇజం" అంటున్నావ్ ..


సింగ :- ఎందుకంటే , ఇది నేడు దేశంలో బాగా విస్తరించిన ఒక "నెట్ వర్క్" కాబట్టి ... అన్ని రకాల అండదండలూ , ధనబలం , వార్తాసాధనాలద్వారా ప్రచారం పక్కాగా సమకూర్చబడుతున్న ఒక సంస్థ కాబట్టి.


లింగ :- అంటే ?


సింగ :- సరిగ్గా చూడు .. గత ఐదేళ్ళలో , హిందూ స్వాములపై , పీఠాల పై , ఆచార్యుల పై , ఎన్ని కేసులూ , ఎంత నిఘా , ఎంత కవరేజీ జరిగిందో .. ఆఖరికి పరమ పవిత్రమైన తిరుమలను కూడా వదలకుండా , ఈ "ఇజం" ఎంతలా వేళ్ళూనుకుపొయిందో ..


లింగ :- నువ్వు హిందువువని ఇలా అంటున్నావనుకోవచ్చుగా ..


సింగ :- నేను మాత్రమే కాదు , ఈ మార్పిడుల్లో సాయ పడుతోంది కూడా హిందువులేరా ... కాని పేద హిందువులు ... పూర్వం బ్రిటీషు సైన్యం లో సగం మంది భారతీయులే ఉన్నట్లు ... ఈ "ఇజం" లో కూడ సగం మంది కార్యకర్తలు పేద హిందువులే , వాళ్ళ పేదరికానికి డబ్బు ఎరగా వేసి ఆకర్షిస్తున్నారు ..

లింగ :- టెర్రరిష్టు సంస్థల్లా తయారయ్యారంటావు ..



సింగ :- మన దేశ సంస్కృతి లో భాగమైన పరమతసహనం అనే పదానికి వక్రభాష్యం లా తయారయ్యారు .. పొరుగుమత దైవాలని బండ బూతులు తిట్టడం .. బురద జల్లడం .. వారి ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా ప్రవర్తించటం .. ఇదే వీళ్ళ దినచర్య ...



లింగ :- వీళ్ళకింత ధైర్యం , డబ్బూ , ఎక్కడనుంచొస్తున్నాయో ?


సింగ :- ఇంకా అర్ధం కాలేదా .. మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నామురా ... భారతదేశానికి అధ్యాత్మికత అనేది వెన్నెముక అని , దానికి పట్టుగా నిలిచే పక్కటెముకలు ఈ రకరకాల మతాలని కనిపెట్టి , "విభజించి పాలించు " సూత్రాన్ని పాటిస్తూ దేశానికి స్వాతంత్రం ఇస్తూనే , మత చిచ్చు పెట్టి పొయారు తెల్లోళ్ళు .. వాళ్ళ వారసులుగా , ఈ "ఇజం" పాటించే వాళ్ళు తయారయ్యరు ..


లింగ :- అంటే ఇదంతా చేయించేది బ్రిటీషు వాళ్ళే అంటావా?


సింగ :- మనం అద్దం లాంటి వాళ్ళమ్రా .. ఆ రాయే కాదు , ఏ రాయి తగిలినా పగిలిపోతాము , అలా దశాబ్దాలు గా పగుల్తూనే ఉన్నాం ..


లింగ :- మరి దీనికి అంతం లేదా?


సింగ :- ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు వారు .. ఒక అద్దం లో ఒకటే కనిపించే బింబం , అది పగల కొట్టగానే , వేల అద్దాలలో వేల బింబాలుగా ప్రతిఫలిస్తుంది .. ఒక బింబాన్ని నాశనం చెద్దామని వచ్చినవాళ్ళకి , వేల బింబాలు దర్శనమిస్తున్నాయి .. అందుకే , ఆ ఉక్రోషం లో చెస్తున్నవే ఈ తాటాకు మోతలు ..


లింగ :- సరైన మాటన్నావ్ ! జై హింద్ ..


సింగ :- జై హింద్

1 comment: