ఎదురొచ్చే కష్టాలని ,
ఎదిరించడంలోనే ఉంది విజయం ...
కదిలొచ్చే కెరటాలని
చీల్చుకుంటూ పోయేదే పయనం ...
కలిసి రాని కాలపు బలాన్ని తిట్టుకుంటూ వదిలేస్తామా ?
నిబ్బరంగా సంకల్పంతో తట్టుకుని నిలబడలేమా ?
వెన్నుచూపే వారిని , వారి నీడకూడ వెక్కిరిస్తుంది ...
నిన్ను నువ్వే నమ్ముకుంటే , ఆ మిన్ను కూడా వంగి వస్తుంది ...
సమస్యల చీకటి లో ఇంక కన్నీరు తో మిగిలిపోదామా?
గెలుపనే వెలుతురు వెతుకుతూ , చిరునవ్వుతో సాగలేమా ?

Inspiring..Excellent
ReplyDeleteజ్యోతిర్మయి గారికి,
ReplyDeleteధన్యవాదాలండి .