ఒక ఉదయం,
అటూ ఇటూ విచే అల్లరి గాలులకి,ఎగురుతూ సాగుతూన్న ఒక యెండుటాకు ,'చిటపటా' చప్పుడు చేసుకుంటూ , ఒక వృద్ధ వృక్షపు నీడలోకి వచ్చి ఆగింది ... ఒక సారి ఆ చెట్టుని ఎగా దిగా చూసి ఎదో గుర్తుకుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ..
' మసక బారిన ఙ్ఞాపకాల గదుల్లారా !
మరుపు నిండిన నా మస్తిష్కపు పొరల్లారా !
ఏదో తెలియని అభిమానం ,
ఈ నీడన నాలో చిగురిస్తోంది
ఎన్నో ఏళ్ళ ఒక పరిచయం ,
మళ్ళీ ఇక్కడ పలకరిస్తోంది .
ఎక్కడిదర్రా , ఈ మధుర గానం , ఇంకా ఎదలో మోగుతోంది ..
ఎప్పటిదర్రా , ఈ పులకింతల పరిచయం , తలపుల్లో ఇంకా మెదులుతోంది ? '
అని ప్రశ్నించింది .. అది విని ఆ చెట్టుకి ఉన్న ఆకులు గల గలా నవ్వాయి , 'ఈ ముసలి ఆకుకి రాలిపొయినా ఇంకా మతిమరుపు పోలేదు ' అని కొన్ని పిల్ల గాలులు తమలో తాము గుసగుసలాడుకున్నాయి .. అది విని ఆ ముసలి ఆకు మనసులో మొలిచిన చిన్న పౌరుషపు తాకిడికి తన స్వరం కాస్త హెచ్చించి ఇలా అంది ..
' నవ్వులాటలే మీకు పిల్ల గాలుల్లారా ,
దుడుకు నవ్వులే మీకు కొత్త ఆకుల్లారా ?
ఉడుకు రక్తపు దుడుకు , ప్రాయముడుగినప్పుడు ఉండబోదు
నేటి మీ సూర్యోదయం , నా రేపటి సంధ్య ముందు నిలువబోదు
అప్పుడు మీ బోసినోళ్ళతో వెర్రి నవ్వులు నవ్వుదురులే
ఆనాడు మీ పలుకుల వాడి ఎంతో నేనూ చూస్తానులే '
అని ఉక్రోషంగా పలికింది , ఆ పలుకులకి నొచ్చుకుని కొన్ని పిల్లగాలులు గట్టిగా వీచాయి , ఆ గాలికి , చెట్టు నుంచి మరొక ఆకు రాలి ,కింద ఈ ఆకు పక్కనే పడింది , పడీ పడగానే తన నేస్తమైన ఈ ఎండుటాకుని చూసి ఆనందంతో హత్తుకుంది ,
' బాధల కెరటాలు , సంతోషపు ముత్యాలు
గంభీరంగా మోసే కడలే ఈ కాలం
కలిసీ కలువని భూమీ ఆకాశపు
సరిహద్దు రాజ్యమే ఈ కాలం
ఆయువయ్యిందని , ఊపిరాగిందని , రాలిపొయిన నా మనసుకు
మరునిముషం లోనే నిన్ను చూపించి చిగురింపజేసింది ఈ కాలం '
అని మురిసిపోతూ తను ఎవ్వరో ఆ ఎండుటాకుకి ఙ్ఞాపకం చేసింది , దూరంగా ఎప్పుడో తను రాలిపొయినప్పుడు ఏర్పడిన గుర్తుని చూపించింది .అప్పుడు గుర్తొచింది ఆ ముసలికి , అది తన ఇల్లని , ఆ చెట్టు తన అమ్మని ... తను రాలిపోయినా ఇంకా తను వదిలి వెళ్ళిన గుర్తులని మోస్తున్న తన తల్లి ని చూసి ..
'గుండె తడి అయినా
మనసు చెమ్మగిల్లినా
చుక్క కన్నీరయినా మిగలని
అలసిపొయిన ఎండుటాకుని '
అని బాధ పడుతూంటే , చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై ఆ ఎండుటాకుని తడిపింది ..

చాలా బాగుంది.
ReplyDeleteఒక కవితలో ఎండుటాకుల గురించి ఒక ఒక వాక్యంలో ఒక భాగంలో చెప్తుంటారు. మీ కథ చాలా బాగుంది. ఇది మనుషుల జీవితాలకూ అన్వయిస్తుందని విశదంగా (చెప్పకనే) చెప్పారు.
"చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై" అద్భుతమైన ఊహ.
మీకు గుర్తుందో లేదో నేను మీ పాత పాఠకురాలినే.
మందాకిని గారూ ,
ReplyDeleteపునఃస్వాగతం !!
ఇలాంటి నా ప్రయత్నాలని , చదివి ప్రోత్సహించే మీరు నాకు గుర్తున్నారండీ . మళ్ళీ మనం పద్య రచన ద్వారా పునఃపరిచయం అయ్యాం.
ఈ కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి . సమయాభవం వల్ల ఇలా వచన కవిత అయిపొయింది , లేకుంటే పద్యాలలో రాద్దామని మొదలు పెట్టాను :-)
ఎంత బావుందో..మీరు తరచుగా వ్రాస్తుండ౦డి కళ్యాణ్ గారూ..
ReplyDeleteజ్యోతిర్మయి గారికి,
ReplyDeleteధన్యవాదాలండి . చాలా సంతోషం . రాస్తూ ఉంటాను గాని బ్లాగ్ లో పెట్టడంలో కొంత బద్దకం చూపిస్తున్నాను , మీరందరి ప్రోత్సాహంతో తప్పకుండా ఇక నుంచీ తరచుగా బ్లాగ్ లో పెడతానండి .