నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..
నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..
సాటివారి పై బురదజల్లాలని ..
ఆలోచిస్తూ కాలం గడిపాను ..
వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..
నా చేతులకి నేనే బురద చేసుకున్నాను ...
మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..
ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...
మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..
ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..
రిక్త హస్తాలతో నీ ముంగిట..
యాచిస్తూ నిలిచున్నాను ..
కొత్త ఉదయం ప్రసాదించమని ..
కాస్త ఇంగితం ప్రచోదించమని .
కాపీరైట్@కళ్యాణ్ 2011
Boss. Touched. Very True
ReplyDeleteThank You. Am Happy that you liked.
ReplyDeleteSuperb.. Excellent..
ReplyDeleteExcellent..
ReplyDeleteచాలా బాగుంది కల్యాన్ గారూ..
ReplyDeleteరాజేష్ గారికి,
ReplyDeleteజ్యోతిర్మయి గారికి,
శుభ గారికి,
ధన్యవాదాలండి . మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
కల్యాణ్ గారూ,
ReplyDeleteఈ కవిత చాలా అందంగా ఉంది.
ప్రారంభం...
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ....
చాలా చక్కగా ఉంది. అభినందనలు.
తెలుగు అనువాదాలు గారు ,
ReplyDeleteకృతఙ్ఞతలండి . మీ ప్రోత్సాహకర మాటలకి చాల సంతోషమండి