Thursday, 27 October 2011

నా (పగటి)కలల సుందరికి ..

(సినెమాలు చుస్తూ , ఎవేవో ఊహించుకుంటూ పగటి కలలు కనే , ఆ అమాయకత్వం , కాలక్రమేణా కనుమరుగవుతుంది , కాని ఆ ఙ్ఞాపకాలు మాత్రం మిగిలిపొతాయి ..  )



కలవై కనులకు కనిపించావు
చిరునగవై పెదవికి పరిచయమయ్యావు


ఊహల అలపై ఊయలలూపి
కొత్త తీరాలని మనసుకి చూపి


ఏ ఆవిరి తెరల మాటుకు మాయమయ్యావు?
ఒక మంచుశిల్పానివై మిగిలిపొయావు ..


పగటికలల నీ ధ్యానం లో , నా ప్రాయం
మధుర ఙ్ఞాపకమై మిగిలిపొయింది
పరిణితి అనే మౌనంలో , నా కర్తవ్యం
ఒక చేదు నిజంగా ఎగసి వచ్చింది .

2 comments:

  1. Padmarpita గారు కృతఙ్ఞతలండి ! మీకు నచ్చినందుకు సంతోషమండి !

    ReplyDelete