తొలగును భవ భీతి తొలగు నఙ్ఞానంబు
తొలగు నఘము, భయము తొలగు చింత
చిత్త శుధ్ధి పెరుగు సేయగ నిత్యంబు
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
మూగ వాని గొంతు మ్రోగును వినినంత,
కుంటి వాడు దాటు కొండ నైన
మహిని దీని మించు మహిమాన్వితంబేది ?
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
రేయి పవలు నేడ్చు రేపల్లె లోబిడ్డ
నూరడించ వాని నొడిన దాల్చి
అమ్మ జేసె ,తనయుడానందమున్ నవ్వ ,
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
తొలగు నఘము, భయము తొలగు చింత
చిత్త శుధ్ధి పెరుగు సేయగ నిత్యంబు
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
మూగ వాని గొంతు మ్రోగును వినినంత,
కుంటి వాడు దాటు కొండ నైన
మహిని దీని మించు మహిమాన్వితంబేది ?
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
రేయి పవలు నేడ్చు రేపల్లె లోబిడ్డ
నూరడించ వాని నొడిన దాల్చి
అమ్మ జేసె ,తనయుడానందమున్ నవ్వ ,
కృష్ణ దివ్య నామ కీర్తనంబు
ఆటవెలదుల్లో |
ReplyDeleteకీర్తనామృత వైభవపు వెలుగుల్లో||
కళ్యాణ్ పలుకుల్లో|
కళ్యాణకర చక్కెర పలుకులు!|| (ముక్కలు)
చాలా బాగున్నాయి. నాకు మూడవది బాగా నచ్చింది .
ReplyDelete