Wednesday, 1 February 2012

స్నేహం

నిర్జీవపు నిశీధి నిండిన హృదయంలో
మరణించిన మనశ్శాంతికి సంజీవని స్నేహం

వెంటనడిచే నీడ కూడా వెక్కిరించే వేళల్లో
కంటతడిని కాచేటి ఓదార్పు స్నేహం

కన్నూ మిన్నూ కానని అహంకారంలో
నిన్ను నీకు తెలియజేసే గుణపాఠం , స్నేహం

పసితనపు ఆటలనుండీ
పండుముదుసలి బోసినవ్వులవరకూ
పంచుకునే చెరిసగమే స్నేహం

ప్రేగు బంధం కాదిది ,
ప్రేమ ఆకర్షణ కానిది

తన నిరుపేద సఖుని పిడికెడు ప్రేమకి
నిలువెల్ల కరిగిన జగన్నాధుని హృదయమిది .



                                                                      --కాపీరైటు @2012 కళ్యాణ్

3 comments:

  1. Wonderful thought

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కష్టేఫలి గారు .

      Delete
  2. నువ్వు ఇది మొదట రాసినప్పుడు

    ప్రేగు తెంచిన బంధం కాదు
    ప్రేమ పెంచిన మోహం కాదు

    అని రాసినట్టు గుర్తు. call it the first impression, ఇప్పుడు రాసిన దాని కన్నా ఆ ప్రయోగమే బావుంది అని నా అభిప్రాయం . :)

    ReplyDelete