tag:blogger.com,1999:blog-28041827686231749752024-03-18T20:46:21.424-07:00ఆలోచిస్తే...ఆలోచన అన్నిటికీ మూల కారణం . భావోద్వేగాలు , రసాస్వాదన ఇలా ఏ అంశాన్నైనా ఆలోచనలు ప్రభావితం చేస్తాయి . ఈ నా బ్లాగ్ , నా ఆలోచనలకి ప్రతిరూపం, అలాగే సింగరాజు లింగరాజు గార్లవంటి ప్రముఖులకి ఒక వేదిక !! ఆస్వాదించండి , ఆలోచించండి ...Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-2804182768623174975.post-88872784497106275392018-05-03T04:43:00.003-07:002018-05-04T14:39:30.572-07:00అమెరికాలో పద్యనాటకం

Youtube Link of the Play :

మౌర్యచరితం ( ప్రవాసంలో పద్యనాటకం )

దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వమే "పాత" అని ముద్రవేయించుకుని చలనచిత్రాల తాకిడికి కొంత ధృతి తగ్గి కొన్ని సందర్భాలకే పరిమితమైన నాటకం, అందునా పద్యనాటకం , ప్రవాసంలో ఈమధ్య మళ్ళీ పునరుజ్జీవం పొందుతోంది

ఈనాటి లఘుచిత్రాల కాలంలో మళ్ళీ పద్యనాటకాలు ఆదరణకు నోచుకోవడం మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తార్కాణం అనుకోవచ్చేమో ..

పద్యాన్ని అమెరికాలో ఉన్న మన తెలుగు పిల్లలకు ఎలా చేరువ చేయవచ్చు అనే ఆలోచనకు జవాబుగా 2017 లో ఓర్లాండో నగరంలో మొదటిసారిగా టాగో ఉగాది వేదికపై ప్రదర్శించిన "భువనవిజయం " రూపకంతో మొదలైన ఈ నా పద్యనాటక ప్రస్థానం , ఓర్లాండో , తలహాసీ , చికాగో ప్రేక్షకుల ఆదరణతో చక్కగా కొనసాగుతోంది .. అంతా శ్రీమాత దయ !

అందులో ముందుగా ఈ మధ్యే ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం మీ అందరి ఆశీర్వాదంకోసం పైన youtube లింక్ లో ఉంది ... ఆనందించండి , ఆశీర్వదించండి

తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి ( Kalyan Tatavarthy )

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-48757817877934991852016-06-24T08:37:00.000-07:002016-06-24T08:37:06.366-07:00బ్రిటీషు నిష్క్రమణము పై .....

ఎక్కడో వేరే దేశంలో కూర్చుని , ప్రపంచ రాజకీయాలపై పత్రికల్లో చదివే నాబోటి వాడికి , వాస్తవ పరిస్థితులు కేవలం వార్తలద్వారా మాత్రమే తెలుస్తాయి కాబట్టి , ఒక 'బయట వ్యక్తి ' గా కొన్ని ఆలోచనలు ...

బిటీషు వారు ఐరోపా సమాఖ్య నుండి వైదొలుగు తున్నారని చదివి , అసలు ఐరోపా సమాఖ్య ఎలా మొదలైందో కుతూహలం వచ్చి , గూగుల్ గారిని అడిగితే , వికీపీడియా వారు 'ఓయ్ ' అన్నారు ...

వారిని బట్టి , మొదట బొగ్గు , స్టీల్ , ఆయిల్ వ్యాపారాలు సజావుగా సాగటానికి ఆరు ఐరోపా దేశాలు ( బ్రిటీషు వారు లేరు ) కూటమిగా ఒప్పందం చేసుకున్నాయట , ఇది 1957 నాటి మాట ..

1960 లో బ్రిటీషు వారు తమంత తాము ఈ కూటమి లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు ( అందరిలాగే ఆర్ధిక , సామాజిక ప్రయోజనాల కోసం ) .. కాని అప్పటి ఫ్రాన్సు అధ్యక్షులు ఇదేదో అమెరికా వారి కనసన్నల్లో జరుగుతున్న బాగోతం అని ఊహించి , 1967 వరకు దీనికి ఒప్పుకోలేదు , ప్రభుత్వాలు మారాయి అందువల్ల సహజ పరిణామంలా నిర్ణయాలు మారాయి .. 1973 లో యేట్టకేలకు బ్రిటీషు కూటమి లో సభ్యులయ్యారు

సరే కాలం మారింది , ఓడలు బళ్ళయ్యాయి .. అప్పటి సంపన్న దేశాలైన ఫ్రెంచు , ఇటాలియన్లు , ఇప్పుడు ఏమంత గొప్ప ఆర్ధిక వ్యవస్థలు కావు ...

సరే , ఇప్పుడు ఎందుకు కూటమి నుంచి బ్రిటీషు వారు వైదొలుగుతున్నారు అంటే ప్రధానంగా వినపడే మాట ' కాందిసీకుల ' వల్ల..

టూకీగా చెప్పలంటే బ్రిటీషు వారుగా చెలమణీ అవుతున్న నేటి జనాల్లో చాలా మంది నిజమైన 'బ్రిటీషు ' వారు కారు ...

కూటమి ఒప్పందాల వల్ల , కూటమి దేశాల్లో యే దేశ పౌరుడైనా మిగతా దేశాలకి స్వేచ్ఛగా వెళ్లవచ్చు .... అంతా బానే ఉంది గాని అసలు బాధ ఇక్కడే ఉంది ..

మధ్య ప్రాచ్యంలో జరిగే పరిణామాల వల్ల , కొన్ని కోట్లలో జనాలు ఐరోపా కి వలస వస్తున్నారు ... ఐరోపా లో వారి దేశ పౌరులకి చాల సామాజికాంశాలు ( విద్య వైద్యం మొదలగునవి ) ఉచితమే ... ఈ కొత్తగా వచ్చే వారివల్ల , ఎంత నియంత్రించినా ఖర్చు పెరిగిపోతోంది ప్రభుత్వాలకు , మరొకవైపు ఉగ్రవాదం ..

ఈ పరిస్థితుల్లో , మొత్తం ఐరోపా ఖండం అంతా కష్టం లో ఉంది ... ఈ సమయంలో తన దేశ భద్రత కోసం ఆ దేశ ప్రజ , ఈ కూటమి నుంచి వైదొలగడం ( తద్వారా , కూటమి ఒడంబడికలు వర్తించవు , శరణార్ధులకి ప్రవేశం ఆపొచ్చు )

వారి దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయంలా ఒక రకంగా సబబు అనిపిస్తున్నా .. మరొకపక్క 'ఏరు దాటాకా తెప్ప తగలెయ్యటం ' లాగానూ అనిపిస్తోంది ...

రవి అస్తమించని బ్రిటీషు వారు , కష్ట కాలంలో నాయకత్వం వహించకుండా , చీకట్లో మెల్లగా జారుకుంటున్నారేమో ! ఏమో , మళ్లీ రేపటి పత్రిక ఏమి వార్తలు మోసుకొస్తుందో చూడాలి ...

ఈ లోపు కొన్ని కంద పద్యాలు ' మేమున్నాం ' అని ముందుకొచ్చాయి ...

రవి అస్తమించని ప్రజకు

జవ సత్త్వ విహీన సభ్య సంఘము చేదై

అవనిన్ పాలిత పాలక

నివహంబుకు భ్రాంతి కూర్చి నిలిచెను వేరై

మా కుంపటి మా సొంతము

మీ కూటమి గాదు మేము మేలు దలుపగన్

లోకంబును పాలించిన

మాకేలా పరుల గోల మనకు విడాకుల్

ధాటిగ తమ గతి వేరని

చాటిన యాంగ్లేయులింక సత్యము నరయన్

కోటలు లోటును దీర్చవు

యేటికి యెదురీత భవిత యెరుగుదు రేమో

పరదేశ కాందిశీకుల

పరమై దేశము చెడునని భయపడు వారా

పరులన్ బానిస జేసుకు

చెర పట్టిన నాటి వీరశేఖరు లకటా !

విరిగెను మొదట కుటుంబము

విరిగెను మనసులు కులమత విద్వేషంబున్

విరిగెను దేశము తదుపరి

విరుగుట ఖండంబు జేరె విష సంస్కృతియై

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-36666588565616765902015-11-12T13:08:00.000-08:002015-11-12T13:08:41.597-08:00శివ ఝరి

నేల నచ్చదన్నట్టు

ఆకాశాంలోనే ఉండిపోయిన గంగమ్మా

ఏ భగీరథుడు పిలిచాడో

ఏ భీష్ముడు గుర్తొచ్చాడో

ఒక్కసారిగా ఒడలు మరిచి

ఊరి గడపలు తడిపేస్తున్నావు

దిక్కులన్నీ తరిచి తరిచి

చినుకు సంద్రాలు మధిస్తున్నావు

ఆ ...తెలిసింది లే ...

భక్తుడి అరుపో .. బిడ్డ పిలుపో కాదు

ఆ మూడు కళ్ళ నీ పెనిమిటి వలపులే

ఎండి పోయిన నేలని

ఇంకి పోయిన ఆశని

నీ కార్తీక అభిషేక రూపమై

మరో గంగావతరణమై

మళ్ళీ బ్రతికిస్తున్నావా ..

ఎంత దయ నీది శివా

( ఈ మధ్య పడిన వానలు , కార్తీక మాసం ... అంతా శివమయమే.. అందరం శివ పరివారమే )

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-87337726614969450492015-10-06T14:01:00.001-07:002015-10-06T14:01:56.417-07:00ప్రభవ

లెక్కకు అందనంత అంతరం

నీకు నాకు మధ్య అల్లుకుపొతున్నా

ఒక్క మనసులోని నిశ్శబ్ద ప్రవాహం

వేల చినుకులై ప్రభవిస్తున్నా

వెళ్తాను , నాకై నియమించిన పనికి

నీ పనిముట్టై వెళ్తాను ...

నీ ఉనికి ,దిక్కులకి చాటడానికి

నా ఉనికి విడిచి వెళ్తాను ...

నీ జ్ఞానం పరిఢవిల్లటానికి

నేను అజ్ఞానమై వెళ్తాను ....

నే నడిచే దారుల్లో

పూలు పరిచినా , రాళ్లు విడిచినా

నా ఖాతాలో జమ చేసిన రోజుల్లో

వెలుగు నింపినా , చీకట్లు పంపినా

నీ ఇష్టాన్ని కాదంటానా

నేనే నువ్వన్న నిజం నుంచి,

"నేను" అనే అబద్దంగా

నీ ఆజ్ఞ మహత్యం చుసావా , అప్పుడే మారిపోయాను

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-23845445351081059652015-09-24T13:17:00.000-07:002015-09-24T13:17:59.877-07:00సింగరాజు - లింగరాజు : మేధావుల సదస్సు ఇన్ విదేశం

ఎప్పటిలాగే చుట్టల కోసం బజారులో అప్పన్న కొట్టుకి వచ్చిన మన లింగరాజుకి ,

దూరంగా విజయవిహార్ సెంటరులో మెరిసిపొతూన్న ఫ్లెక్సీ కనపడింది ...

దేన్నీ పట్టించుకోని మన లింగరాజు , ఆ ప్లెక్సీ చూసి బెంబేలెత్తిపోయాడు .. దాని మీద విషయం అలాంటిది మరి

" ప్రపంచ సమస్యలకి సమాధానం వెతికే సదస్సు కి ,

ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు వదిలేసి ,

స్వతహాగా మేధావి కాబట్టి

ఆహ్వానం లేకపోయినా విదేశం వెళ్ళిన సింగరాజు గారికి అభినందనలతో ...

సింగరాజు ఫ్యాన్స్ ( భజన ) సంఘం .. "

అని ఉదయించే సూర్యుడి బొమ్మ , గాంధీ గారి , పోరాట యోధుడు 'చే' గారి బొమ్మల మధ్య , మాసిన చిరుగడ్డం తో దీర్ఘంగా ఆలోచిస్తున్న సింగరాజు బొమ్మ ..

గోదారి గట్టు దాటి ఎప్పుడూ ప్రక్క జిల్లాకి కూడా వెళ్లని వీడు విదేశమేంటో అని సింగరాజు ఇంటికి హడావిడి గా బయల్దేరాడు లింగరాజు

రామాలయం దాటి , మసీదు వీధి లోకి రాగానే అక్కడ ఇంకో ప్లెక్సీ ..

" విదేశాల్లో సాగు పద్ధతులు అధ్యయనం చెయ్యడం కోసం వెళ్ళిన మన రైతుజన బంధు సింగరాజు , వర్ధిల్లాలి ...

ఇట్లు సింగరాజు రైతుయూత్ "

ఇందాక ప్రపంచ సమస్యలన్నాడు .. ఇప్పుడేమో రైతు , సాగు అంటున్నడు ... మా చెడ్డ తికమక గాడెహై అనుకుంటూ ఈ గందరగోళం అంతు చూద్దామని నడక వేగం పెంచాడు

అలా లక్ష్మీ టాకీసు మలుపు తిరిగాడో లేదో ...

అప్పాయమ్మ గారి ఇంటి గోడ మీద ,

పిడకల మధ్య ,

నెత్తి మీద యెర్రటి తలపాగా చుట్టుకుని పగటివేషగాడి మల్లే నవ్వుతున్న సింగరాజు గారి చిత్రరాజం దర్శనమిచ్చింది ... అదే పోష్టరు మీద ఇంకా ఇలా రాసి ఉంది ..

"విద్యార్ధుల సామాజిక న్యాయం కోసం , విదేశాల్లో ధర్నా చేయడానికి వెళ్ళిన భారతఛాత్రమిత్ర సింగరాజు జిందాబాద్"

ఈ ఛాత్ర ఏంటో , విదేశాల్లో ధర్నా ఏంటో ... వీడు వీడి తింగరి ప్రచారం అనుకుంటూ , అసలు కారణం ఏంటబ్బా అని అలోచిస్తూ వెళ్తున్న లింగరాజుకి , సింగరాజు భార్య కనపడింది ...

లింగ : చెల్లాయ్ , ఏంటమ్మా వీడు ? ఊరంతా ఈ పోష్టర్లు ఎంటి , ఈ ప్రచారం ఏంటి ?

మేధావి అని వేయించుకుంటూ వాడి మూర్ఖత్వం ప్రదర్శించుకుంటున్నాడు .... ఛాత్రమిత్ర అంట ....

వీడు పదవ తరగతి పది సార్లు తప్పింది మర్చిపోయాడా ?

సింగ భార్య : నీకు తెలియనిదా అన్నయ్యా...

మొన్న జరిగిన ఊరి ప్రెసిడెంటు ఎన్నికలలో , ఓడిపోయిన సూరిబాబు ,

ఈయన తింగరి ప్రచారం వల్లే ఓడిపోయాడు అని అర్ధమయ్యిన అధిష్టానం ...

ఈయన కనపడితే బడితపూజ చెయ్యడానికి ఉత్తర్వులు జారీ చేసింది ...

అందుకే కొనాళ్ళు అజ్ఞాత వాసం చెయ్యాలని ఇలా విదేశమనే విరాటపర్వం మొదలుపెట్టాడు

లింగ : బావుందమ్మా ! మీ ఆయన కాబట్టి, తప్పదు కాబట్టి అజ్ఞాతవాసం ,విరాటపర్వం , అని వెనకేసుకొస్తున్నావు ... వీడు నర్తనశాల సినెమా లో ఉత్తరకుమారుడికన్నా పెద్ద పలాయనవాది .. ఇంతకీ ఎక్కడ చచ్చాడు వీడు ?

సింగ భార్య : మా ఇంటి వెనకాల గొడ్ల చావిడిలో తాత్కాలిక సిబిరం ఏర్పాటు చేసుకున్నారు ...

లింగ : పాపమమ్మా వెర్రి గొడ్లు .. వీడి పిచ్చి వాగుడు వినలేక పాలు ఇవ్వటం కూడా మానేస్తాయేమో చుసుకో

అంటూ , ఆ సూరిబాబుకి కనపడితే, సింగరాజు మిత్రుడినని తనని ఎక్కడ వాయించేస్తాడో , అనుకుంటూ వడివడి గా ఇంటికి తిరుగుముఖం పట్టాడు

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-12732730620791637832015-09-17T13:43:00.000-07:002015-09-17T13:43:41.802-07:00కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము

ఆ||

శ్రీధర చరణాబ్జ సేవ సద్భాగ్యము.

మాధవజన కూర్మి మనెడి ధనము.

పార్ధహితుని గూర్చిపాడు జిహ్వ స్థిరము.

కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము

మాధవుడి చరణాలనే పద్మాలని సేవించుకోవటం భాగ్యాల్లోకెల్లా మా మంచి భాగ్యం

ఆయన జనాలుతో చేసే స్నేహమే ఎల్లప్పుడూ ఉండే ( మన్నే ) ధనం

అర్జున హితుని గురించి పాడుకునే పదములే ( నాలుకలే ) స్థిరము

అందుకే కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము

సీస ||

పాపచయము దాటి ప్రారబ్ధముల దాటి

మోహమాయను దాటి ముదిమి దాటి

బుధుల మెప్పును దాటి పుడమి సంపద దాటి

సుజనసంగముదెచ్చు శోభ దాటి

షడరిబంధము దాటి సకలసిద్ధుల దాటి

కాలవ్యవధి దాటి కర్మదాటి

సర్వసాక్షిగ మారి సర్వేశునిజపాద

ధ్యానజనిత యాత్మజ్ఞాన ధను(కి

బిరుదులేవి నెరపు పెద్దసత్కారంబు

భూషలేవి దెచ్చు భూరిసొగసు

సర్వ వర్జితునకు శాశ్వతాభరణము

కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము

పాపాలూ , కష్టాలూ , మోహాలూ , ముసలితనాలూ ,

బుధుల మెప్పు ( గొప్ప వారి మెప్పు ) , భూమి మీద సంపద

సుజనసంగము ( మంచి వారి జట్టు )

షడరిబంధము ( కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాల బంధం )

సిద్ధులు , కర్మ , కాలము ...

ఇవన్నీ దాటుకుని వచ్చిన యోగికి సరైన ఆభరణం వంటి పేరు కృష్ణ భక్తుడని ...

తప్పులన్నీ నావి ... దయ మా కృష్ణుడిది

అదన్నమాట మరి .....మళ్లీ కలుద్దాం

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-22522362001703790482015-09-11T13:59:00.000-07:002015-09-11T14:00:00.532-07:00రైతు వధ

చం ||

నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప, సు

స్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ నా

వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ , రైతు సో

దర ! కను జారు నీరునిక దాచు క్షుధార్తిని దీర్చు నద్దియే

"నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప" == చేసిన అప్పు నిత్యమూ మనసులో మంటగా మారి కాలుస్తూ,

"సుస్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ" == ఏది స్థిరంగా ఉన్నా లేకపోయినా వర్షలేమి మాత్రం స్థిరంగా , జనారణ్యాన్ని కాలుస్తూంటే

"వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ" == వర్షం రాదు , వేడి ఇంకొకపక్క వేసిన విత్తులని చంపేస్తూ

" క్షుధార్తిని " == ఆకలి

జూలై ఆగష్టులలో వర్షాలు పడాలి , కాని పడవు...

వ్యవ'సాయా'న్ని నమ్ముకుని బ్రతకాల్సిన రైతులు , ప్రభుత్వ 'సాయా'న్ని అర్ధిస్తూ ...

విత్తనాలని పురుగుమందులని అప్పులు చేసిన రైతులు అప్పు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్యలని ఆశ్రయిస్తున్నారు.

అన్నదాతలే అన్నార్తులై , తాము దున్నిన పొలాల్లోనే కూర్చుని పురుగుమందులు తాగి చచ్చిపోతున్నారు

ఇది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు..

ఒక దశాబ్దానికి పూర్వం నుంచే అన్నదాతలు బలవన్మరణాలకి పాల్పడుతున్నారు .. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణ తో కలిపి ) , మహారాష్ట్రలో ఎక్కువ మంది ..

2004 లో 18,241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు

2010 లో 15,963 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు

2011 లో 14,207 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు

2012 లో 13,754 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ( Source : wikipedia )

1995 నుంచి మహారాష్ట్రలో రోజుకి పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ( National Crime Records Bureau statistics )

Indian Meteorological department అంచనాల ప్రకారం , 2000-2013 మధ్య కేవలం నాలుగు సంవత్సరాలే జూన్-సెప్టెంబరు మధ్య పడాల్సిన వర్షాలు సరిగ్గా పడ్డాయి

మధ్యలో బిటి పత్తి అని GM Crops అని వచ్చి విత్తనాల రేట్లు పెంచి , తద్వారా రైతు అప్పులు పెంచి, ఆత్మహత్యలకి పరోక్షంగా సహాయపడ్డాయి...

ఇన్ని పద్మవ్యూహాల మధ్య , మన రైతు అభిమన్యుడై యుద్ధం చేస్తున్నాడు..

అప్పటి భారతం అభిమన్యుడిని కోల్పోయింది .. ఇప్పటి భారతమైనా జాగ్రత్త పడి మన అభిమన్యులని కాపాడుకుందాం..

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2804182768623174975.post-53649452701519851632015-09-04T10:33:00.000-07:002015-09-04T10:34:08.541-07:00మాధవుడు - మాష్టారు

మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ ..

గోలోకంలో మాధవుడితో సరదాగా మాట్లాడుతూ , ఖాళీ చల్దిమూటలు వీపున పెట్టుకుని , మందలని తోలుకుంటూ ఇళ్ళకి వస్తున్న గోపాలురకి భూలోకం లోని భరత ఖండం లోనుంచి ' ఆచార్యదేవోభవ ' అని గట్టిగా వినబడుతోంది

గోపాలురు : కృష్ణయ్యా ! ఏంటీ అందరూ ఆచార్యదేవోభవ అని ఈ రోజు గట్టిగా అంటున్నారు ? నువ్వు తప్ప మాకు ఎవ్వరూ తెలియరు , నువ్వో జగదాచర్యుడివయ్యె .. అంటే ఆచార్యదేవోభవ అని నిన్ను పిలుస్తున్నారా ? పని గట్టుకుని నిన్ను పొగడటానికి కారణం ఏంటట ?

మాధవుడు : అదా ! ఈ రోజు భారతవనిలో ఆచార్య దినోత్సవం అని , పిల్లల నుంచి పెద్దల దాకా వాళ్ళకి పాఠాలు చెప్పిన మాష్టార్లని తల్చుకుంటారు , గౌరవంగా పూజిస్తారు .. ఇది ప్రతీ సంవత్సరం జరిగే తంతే గా , కొత్తగా అడుగుతారేంటి ?

గోపాలురు : ప్రతీ సంవత్సరం జరిగేదే అనుకో .. కానీ ఆచార్యదేవోభవ అని ఈ సారి గట్టిగా వినపడుతూంటే ... సందేహం వచ్చింది ..

మాధవుడు : అదా ! 'గురుపూజోత్సవం ' అని పిలుచుకుందాం అని ఆలోచన చేసుకున్నారు వారు .. పర భాష కాకుండా సొంత భాష లో పిలుచుకుందాం అనే ఆలోచనకే ప్రకృతి కూడా పులకరించి ప్రతిధ్వనిస్తోంది ...అంతే ...

గోపాలురు : అదన్నమాట సంగతి , బాగు బాగు ... సరేగాని చాలా చోట్ల ఆ తలపాగా పెద్దాయన చిత్రాలు పెట్టుకున్నారు ఈ రోజు విశేషంగా ! ఎవరాయన ?

మాధవుడు : ఆయనే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ .. తమిళ దేశంలో పెరిగిన తెలుగాయన .

ఆ వేదాంత 'శార్దూల వృత్తాం'తం టూకీగా ఇలా చెప్తా వినండి

|| వేదాంతంబును బోధ జేయు నతడో విద్వాంసుడై భూరి వి

ద్యాదానంబులు జేసె చిత్తమున యద్వైతంబు నే నిల్పె హిం

దూ దేశాన ద్వితీయ రాష్ట్ర పతి యై ద్యోతించె వేదాంత వి

ద్యా దేశాభ్యుదయంబు యూపిరిగ రాధాకృష్ణుడుండెన్ ధరన్ ||

20యవ శతాబ్దం తొలినాళ్ళ నుంచీ ,హిందూ మతంపై , భారత దేశ అధ్యాత్మికత పై విమర్సలు గుప్పించటం మొదలైంది . ఆ విమర్శలకి వివేకానందుడు మొట్టమొదటి అడ్డుకట్ట వేస్తే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఆ అడ్డుకట్టని మరింత పరిపుష్టం చేసారు.

ఆయన ప్రాక్పశ్చిమ దృక్కోణాలకి వారధి లాంటి వారు , మన వారే.

గోపాలురు : ఓహో మంచి మాష్టారన్నమాట . ఐతే సరే మాష్టారు దేవోభవ , అదే అదే ఆచార్యదేవోభవ. మళ్ళీ అంతటి మంచి మాష్టారు ఈ మధ్యే మన దగ్గరకి వచ్చారు గా , ఎవరో తెల్లజుట్టాయన 'కలాం ' అని , మన గోలోకం లోని పిల్లలందరిని కూర్చో పెట్టి కాగితం రాకెట్లు తయారు చేయిస్తున్నారు .

మాధవుడు : ఆయనా మన వారే . మాష్టార్లందరూ నా రూపాలే గా..

గోపాలురు : అవును అవును , కృష్ణం వందే జగద్గురుం

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2804182768623174975.post-38297260272036393072014-09-01T02:59:00.000-07:002014-09-01T02:59:08.890-07:00మాధవుని శిఖిపింఛం -- బాపు

(నిన్న పరమపదించిన బాపూ గారిని స్మరించుకుంటూ)

గోలోకంలో పిల్లనగ్రోవి ఊదుతూ , యమునా నదీ తీరాన విహరిస్తున్న మా మాధవుడితో సాటి గొల్లవారు ఇలా చెప్తున్నారు

మిత్రులు : " నిన్న సాయంత్రం భూలోకం నుంచి తెల్ల లాల్చీ వేసుకున్న ఒక పెద్దాయన ఇప్పుడే వచాడు .. "

మాధవుడు : " ఏడీ , ఎక్కడున్నాడు .. వచ్చిన వాడు కనపడడేమి ? "

మిత్రులు : " అదిగో ఆ పొన్నచెట్టు నీడన కళ్ళజోడు పెట్టుకుని , అస్తమాను ఎదో రాసుకుంటూ కూర్చునో ఇంకో తెల్ల లాల్చీ పెద్దాయన పక్కనే కూర్చుని , తులసాకు , గోపీ చందనపు రాయి ఇలా కనపడినదానిమీదల్లా రాములోరి బొమ్మలు గీసేస్తున్నాడు " అని చూపించారు ...

మాధవుడు : " ఓహా ఆయనా .. నాకు తెలుసులెండి .. నేనే పంపాను .. పని ఐపొయిందని నేనే రమ్మన్నాను " అని ఇలా అన్నాడు ..

|| శ్రీ రామ చారిత్ర చిత్రార్చనల్ జేయ
నా శిరః పింఛమున్ నరుని జేసి
నవరసంబులనల్లి నటులపై చిత్రింప
నా లీలలన్ వాని నడక జేసి
లిపికి వంపులు నేర్పి లేత సోయగ మద్ద
తెనుగు జాతిన వాని స్థిరము జేసి
రమణీయ సాహిత్య రస భావ కూర్మియై
భాసిల్ల నా మర్త్యు 'బాపు ' జేసి

పుడమి 'సాక్షి' జేసి 'బుడుగు'గా నే మారి
'రామ రాజ్య' శోభ రసన పొగుడ
అవతరింప జేసె నవనిపై 'బాపు ' ని
సత్తిరాజు వంశ చరిత మెరువ ||

మిత్రులు : " ఒహో ! అదా సంగతి , సర్లే .. మరి ఆ ఇంకో తెల్ల లాల్చీ పక్కన కూర్చున్నాడేంటి ? "

మధవుడు : " వాళ్లిద్దరూ కూడా , పాలూ వెన్నలా , పిల్లనగ్రోవి లేగదూడలా , మీరూ నేను లా ఒక జట్టు లెండి "

అని చెప్పి చిద్విలాసంగా నవ్వుతూ , అమ్మ యశోద కి ఈ విషయం చెప్పాలని అనుకుంటూ ఇంటికి పయనమయ్యాడు

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2804182768623174975.post-60218673327654102492014-08-17T01:48:00.000-07:002014-08-17T01:49:21.076-07:00శ్రీ కృష్ణ జననం -- పారమార్ధిక సత్యం

జీవం పుట్టుక ఒక వింత !

పుట్టుక యే లేని పరమాత్మ పుట్టడం వింతలలోకెల్లా వింత ! అది కూడా అర్ధ రాత్రి , చెరసాలలో భయంకరమైన రాక్షసుల మధ్య , మాధవ జననం ఒక మహాద్భుతం ..

ఆ అద్భుతం తలుచుకుంటేనే మనసు ఆశువుగా చంపకమాల వృత్తంలోని ఒక చంగల్వ పూదండని స్వామికి ఆర్పించింది .. ఇదిగో అదే ఈ క్రింది పద్యం

|| సాధక చిత్తమన్న చెరసాల నిశీథిన చిన్ని కుర్రవై
దీధితి దప్పి యున్న వసుదేవుని వంశ నిధానమై భవాం
బోధి యగస్త్యుడీవు ధరబుట్టితి వాత్మ నిబోధ నార్ధమై
మాధవ నీ భవంబు నిజ మార్గము మోక్ష విధాన పాఠికిన్ ||

శ్రీ కృష్ణ జననం పారమార్ధిక మైన ఎన్నో రహస్యాలకి ఆలవాలం

శ్రీ కృష్ణుడు దేవకీ దేవి అష్టమ గర్భం -- ముందు యేడు గర్భాలు దాటుకుని పుట్టిన ఎనిమిదో గర్భం , పరాత్పర సత్యం..

అష్టాంగ యోగంలో మొదటి ఏడు దశలను ( ఏడు గర్భాలు ) దాటాకా సాధకునికి కలిగే ఆఖరి దశ , ఎనిమిదో దశ -- సమాధి .. ఇక ఇంతే దీనితో యోగి కుండలిని సహస్రారకం చేరుకుంటుంది , విరాట్స్వరూపం అవగతమవుతుంది .. అదే కృష్ణ జననం ...

ఆహా ! కేవలం పుట్టుకతోనే ఎంత పరమార్ధం బోధించాడో ఆ జగద్గురువు .. తలుచుకుంటేనే రోమాంచితమవుతుంది , ఆది శంకరాచర్యులవారి ' దక్షిణాముర్తి స్తోత్రం ' గుర్తుకువస్తుంది

' మౌన వ్యాఖ్యా పరబ్రహ్మ తత్త్వం ' -- పరబ్రహ్మ తత్త్వాన్ని మౌనంతోనే వ్యాఖ్య చేశారు ఆ ఆదిగురువు ... అదే పరబ్రహ్మ తత్త్వాన్ని పుట్టుకతోనే వ్యాఖ్య చేసారు ఈ జగద్గురువు

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2804182768623174975.post-73641683147597349862013-07-19T05:26:00.004-07:002013-07-19T05:27:35.664-07:00ఆకాశం అద్దెకొచ్చింది

నీలాకాశమనే నిలువుటద్దంలోంచి

వానై వచ్చిన వాగు పలకరింపులు

చిన్ని చినుకు కురిపించిన స్నేహితంతో

విరబూసిన పొలం పులకరింపులు

తోపుడు బళ్ళమీద వాన చినుకు టపటపలు

బొగ్గుల మీద కాలుతూ జొన్నపొత్తుల చిటపటలు

గుప్పిళ్ళు నిండిన కారం పల్లీలు

స్వర్గం చూపించే వేడి పకోడీలు

చూరువారగా చుట్ట కాల్చుతూ ,

తాత చూపుల ప్రశ్నార్ధకాలు ..

పాత పత్రికల బూజు దులుపుతూ

బామ్మలు చేసే కాగితపు పడవలు

ఆకాశంలో రోజూ చూసే

చందమమే కరిగి వస్తున్నాడంటూ

అందుకుందామని దోసిళ్ళు చాచే

అల్లరి బుడతల అమాయకత్వం

యెల్లలు లేని వారి ఆనందానికి

' జలబు ' ' జ్వరం ' అని కళ్లెంవేస్తూ

అలిసిపోయే అమ్మల ఆత్రం

మొన్నటిదాకా మండుటెండతో

ముడుచుకుపోయిన ఊరు

ముసురుతెచ్చిన కొత్త ఊసులతో

మళ్ళీ పల్లవించింది

అలసి పోయిన సూరీడికి సెలవిచ్చి

ఆకాశం నేలపై అద్దెకొచ్చింది

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2804182768623174975.post-85498150588148921792012-08-02T03:49:00.000-07:002012-08-02T03:52:30.919-07:00వేగుచుక్క

అవినీతి ,అరాచకత్వపు

గంజాయి మొక్కల వ్యవసాయంలో

స్వచ్ఛమైన ప్రజస్వామ్యమనే

తులసి మొక్కే కలుపు మొక్క

స్వలాభం , దోపిడీ భావమనే

ఉత్తుంగ తరంగ మహార్ణవంలో

ఎంత వెతికినా దొరకనిదే

చిత్తశుధ్ధి అనే చిన్ని కెరటం

విలువల వలువల ద్రౌపదీ పర్వంలో

వింత చూస్తున్న అందరం కౌరవులమే

అవినీతి చరిత్రలు గల కసాయిలను,

అనుసరించే వారందరం వెర్రి గొర్రెలమే

ఇంత చిక్కని విషసంద్రంలో

అంతు చిక్కని అల్లకల్లోలంలో

కాస్త ఇంగితమే అమృతపు చుక్క

అనంతమైన చీకట్లను తరిమేది

ఆలోచన అనే వేగుచుక్క

- Copyright@2012 Kalyan

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com4tag:blogger.com,1999:blog-2804182768623174975.post-52579873107534779982012-02-22T03:45:00.001-08:002012-02-22T03:46:28.578-08:00సింగరాజు -- మాతృభాషా దినోత్సవం ఏర్పాట్లు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి , ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి , ఊళ్ళో తన పలుకుబడి పెంచుకుందామనుకున్న సింగరాజు దాని ఏర్పాట్లలో ' బిజీ' గా ఉన్నాడు . మధ్యలో మన లింగరాజు ఏదో పని తగిలి 'కాల్ ' చేసాడు .

సింగ :- ' హలో '

లింగ :- ' హలో ....'

సింగ :- ' హలో .. హలో ... సరిగ్గా వినపడట్లేదు , 'సిగ్నల్ వీక్ 'గా ఉన్నట్టు ఉంది , కొంచెం గట్టిగా మాట్లాడండి '

లింగ :- ఒరేయ్ , నేను లింగాన్ని , వినపడుతోందా ఇప్పుడు ?

సింగ :- లింగా ! నువ్వా ! 'ఫైన్ 'గా వినపడుతోందిప్పుడు .. ఏంటి 'మాటర్ ' ఇప్పుడు ' కాల్ ' చేసావు ?

లింగ :- ఏరా పన్లో ఉన్నావా ? పర్లేదా మాట్లాడొచ్చా ?

సింగ :- కొంచెం 'బిజీ ' గా ఉన్నాన్రా , 'ఫంక్షన్ ' ఏర్పాట్లలో ఉన్నాను .

లింగ :- ఏం ' ఫంక్షన్ ' రా ? ఇంట్లో ఏమన్నా విశేషమా ?

సింగ :- ఇంట్లో కాదెహై ! ఈ రోజు ' ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే' , ' సో ' మన ఊళ్ళో పెద్ద 'ఫంక్షన్ ' ఏర్పాటు చేస్తున్నాను .

లింగ:- అవునా ! మాతృభాషా దినోత్సవమా ?

సింగ :- ఏ నీకు తెలీదా ? ఎలాగా తెలుగుని 'యూజ్' చెయ్యరు , కనీసం ఇలాంటి 'డేస్ ' అయినా ' మైండ్'లో పెట్టుకోండిరా. ఎప్పుడు 'చేంజ్' అవుతారురా మీలాంటి వారు . 'వరల్డ్'లో జనాలు మొత్తం వారి వారి 'లోకల్ లాంగ్వేజెస్ ' ని కాపాడుకోవలనే 'థాట్' తో ' పెట్టింది ఈ 'డే' ని . ఇలాగైనా జనాలు తమ ' నేటివిటీ ' ని గుర్తుపెట్టుకుంటారు అని 'హోప్ ' . ఇప్పుడు మీ లాంటి 'సిల్లీ ఫెల్లోస్ ' వల్ల ఆ ' హోప్' కూడా 'లెస్ ' అయిపోతోంది .

లింగ :- ఆపరా బాబు , సమయం చిక్కితే చాలు నామీద విరుచుకుపడతావు . ఇంతకీ ఈ శుభసందర్భంలో నువ్వు ఏం చేస్తున్నావో అది చెప్పు . ఏదో ఏర్పాట్లు అంటున్నావ్ ,ఎమిటో అవి ?

సింగ :- అబ్బో , ఎన్నో చేస్తున్నాం , చాల పెద్ద 'ప్లాన్ '. ఉదయం మన 'గవర్నమెంట్ స్కూల్ ' పిల్లలకి 'తెలుగు భాష యొక్క ఆవశ్యకత ' అనే 'టాపిక్' మీద ' ఒన్ అవర్ ' చిన్న 'ప్రెజెంటేషన్ ' ' అరేంజ్ ' చేసాం . వాళ్ళందరి చేతా తెలుగులోనే మాట్లాడతాం అని ఒట్టు పెట్టిస్తాం .

లింగ :- ఆలోచన బాగుంది , కాని ప్రభుత్వ పాఠశాల ఎందుకు దీనికి . వారిది ఎలాగ తెలుగు మాధ్యమమేగా . ఆ చేయించేదేదో ఏ ఆంగ్ల మాధ్యమ పాఠశాలవారితోనో చేయించొచ్చుగా

సింగ :- ఆ 'ఇంగ్లిష్ మీడియుం స్కూల్ ' వాళ్ళకి ఏవో 'ఎక్స్ట్రా క్లాస్ ' లున్నాయంట , పైగా వారిది 'IIT కోచింగ్ 'సమయం అట ఇది , దానికి తోడు , ఎన్నో ' టాలెంట్ టెస్ట్ 'లకి వాళ్ళ పిల్లలు ' ప్రిపేర్ ' అవుతున్నారంట .

'సో ' ఈ 'టైం'లో పిల్లలని ' డిస్టర్బ్ ' చేస్తే , వాళ్ళ 'మార్క్స్ ' తగ్గితే , ' పేరెంట్స్ ' గొడవ చేస్తారని , 'స్కూల్ రెపుటేషన్ ' పోతుందని , 'నొ ' అన్నారు వాళ్ళు

లింగ :- కాబట్టి ప్రభుత్వ పాఠశాల వాళ్ళతో ఇలాంటి పేచీ ఉండదని , వారు నిత్యం తెలుగులో మాట్లాడుతూనే ఉన్నా , మళ్ళీ వాళ్ళకే తెలుగు ఆవశ్యకత గురించి చెప్తారన్నమాట .

సింగ :- మరీ అంత ' లో ' చేసి మాట్లాడకు , ఈ ' ప్రోగ్రాం ' కి మన ఊరి యెం.యెల్.యె గారు వస్తున్నారు తెలుసా . ఆయనతో మన తెలుగు సంస్కృతి 'గ్రెట్నెస్ ' గురించి నాలుగు ముక్కలు మాట్లాడిద్దామని ' ప్లాన్ '

లింగ :- ఎవరూ ? నోరు విప్పితే బూతులు తప్ప ఇంకోటి రాని ఆ యెం.యెల్.యె గారేనా ? మొన్న శాసనసభలో ఎవో బూతు చిత్రాలు చూస్తూ పట్టుపడిన ఒక శాసనసభ్యుడి చేతిలో ఉన్నది మన యెం.యెల్.యే గారి మొబైలే నట . నీకా విషయం తెలుసా ? ఆయన తెలుగు సంస్కృతి గురించి మాట్లడతాడా !

సింగ :- చూసింది ఆయన కాదు కద ! అయినా నీకు ఈ రోజు ' లాంగ్వేజి డే ' అనే తెలీదు . నీకు 'కామెంట్' చెసే హక్కు లేదు రా .

లింగ :- అవునా ! నిజమే నాకు తెలియదురా , నీకు కొంచెం ఇటువంటి విషయాలలో అవగాహన ఉన్నట్టు ఉందే ?

సింగ :- 'యా!'

లింగ :- అలగైతే నాకు కొన్ని విషయాలు చెప్పి పుణ్యం కట్టుకోరా , నేను కూడా నీలాగా లోక ఙ్ఞానం పెంచుకుంటాను .

సింగ :- 'ఓ ష్యూర్ , వై నాట్ '

లింగ :- ఇంకా ఈ జనాభాలెక్కలు పూర్తికాలేదు కాబట్టి , ఇతః పూర్వం అనగా 2000-2001 లో జనాభా లెక్కల ప్రకారం , భారత దేశ ప్రాంతీయభాషలలో అత్యధికులు మాట్లడే భాష ఏది ? ప్రాంతీయ భాషలురో , హిందీ అనుకునేవు , అది జాతీయ భాష !

సింగ :- ' ఐ గెస్ , ఇట్స్ తమిళ్ ' , వాళ్ళ భాషాభిమానం , తమిళుల కట్టుబాట్లు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది .

లింగ :- ఏమో మరి , ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే మొదటి 15 భాషల్లో మన దేశ ప్రాంతీయ భాషలు ఉన్నాయా ? ముఖ్యంగా మన తెలుగు ఉంది అంటావా ?

సింగ :- తెలుగే ఉండి ఉంటే ఇంత నెత్తీ నోరూ కొట్టుకుని మేము సభలు పెట్టి ఉండం . ఖచ్చితంగా ఉండి ఉండదు .

లింగ :- ఇంక ఒక్క చివరి ప్రశ్న . రవీంద్రనాథ్ టాగూరు తర్వాత , సాహిత్యంలో నోబెల్ బహుమతి పరిశీలనకు మన దేశ రచయితలు రాసినది ఏమన్నా వెళ్ళిందా ?

సింగ :- అప్రస్తుతం ఇది . ఇప్పుడు ఈ 'క్వశ్చన్ ' ఎందుకు ?

లింగ :- అప్రస్తుతం కానే కాదు , 'భాషా దినోత్సవం ' గురించి తెలిసిన నీకు , భారత దేశంలో అత్యధికులు మాట్లడే ప్రాంతీయ భాష 'తెలుగు ' అని తెలియకపోవడం , పైగా అది మన పక్క రాష్ట్రం వారి భాష ఏమో అని వారి భాషాభిమానాన్ని మెచ్చుకోవటం , మరియు , తెలుగు ఎక్కువగా మాట్లడే ప్రపంచ భాషల్లో 13 వ స్థానం లో ఉంది అని తెలియదు . 'నా దేశం నా ప్రజలు ' అనే ఒక గ్రంధం నోబెల్ పరిశీలనకు వెళ్ళిందని , అది వ్రాసింది ఒక తెలుగువాడు అని కూడా తెలియదు . ఇంకేమనాలిరా .

కట్ ...... మరుక్షణం ఆ కాల్ కట్ అయిపొయింది ...కొంత సేపు మౌనం , తర్వాత , ఒక మెసేజి వచ్చింది .. దాని సారాంశం ...

' సారీ రా లింగా ! 'కాల్ కట్ 'అయ్యింది ! 'ఫంక్షన్ 'తర్వాత నీకు చేస్తాను , 'టిల్ దెన్ టేక్ కేర్ '

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2804182768623174975.post-3057751057933222742012-02-08T01:49:00.001-08:002012-02-08T01:49:59.106-08:00కృష్ణ నామ కీర్తనము -- కొన్ని పద్యాలు
తొలగును భవ భీతి తొలగు నఙ్ఞానంబు

తొలగు నఘము, భయము తొలగు చింత

చిత్త శుధ్ధి పెరుగు సేయగ నిత్యంబు

కృష్ణ దివ్య నామ కీర్తనంబు

మూగ వాని గొంతు మ్రోగును వినినంత,

కుంటి వాడు దాటు కొండ నైన

మహిని దీని మించు మహిమాన్వితంబేది ?

కృష్ణ దివ్య నామ కీర్తనంబు

రేయి పవలు నేడ్చు రేపల్లె లోబిడ్డ

నూరడించ వాని నొడిన దాల్చి

అమ్మ జేసె ,తనయుడానందమున్ నవ్వ ,

కృష్ణ దివ్య నామ కీర్తనంబు
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2804182768623174975.post-81374324655164380112012-02-03T04:09:00.000-08:002012-02-03T04:09:22.359-08:00లింగరాజు - ఉపకారం
(కష్టేఫలి బ్లాగ్ లో 'శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపకారం' శీర్షికన రాసిన వ్యాసం చదివి దాని స్పూర్తి తో రాసినది ఇది , శర్మ గారికి కృతఙ్ఞతలు )

'ఉపకారికి ఉపకారం విపరీతము గాదు సేయ ......' అంటూ దూరంగా తెలుగుమాస్టారి ఇంట్లో ట్యూషను పిల్లలు వల్లెవేయటం వినపడుతోంది .

లింగ :- ' ఉపకారమా ,వంకాయా . పొరుగువాడికి ఉపకారం , అది చేసేవాడికి మాత్రం ప్రత్యక్ష నరకం '

సింగ :- ఎమిట్రా లింగా ! ఉపకారం పేరు ఎత్తితే కారాలు మిరియాలు నూరుతున్నావు ? కనీసం ఆ తెలుగు మాష్టారి ట్యూషను పిల్లలకున్న ఙ్ఞానం కూడా నీకు లేనట్టుందే ...

లింగ :- నీకేం తెలుసు బాబు ఉపకారుల కష్టాలు , నీతులు చెప్పడం తెలుగు సినెమాలో హీరోలు కూడా చేస్తారు .. అవి పాటించటమే , రాజమండ్రి బ్రిడ్జి గతుకుల మీద బండి నడిపినంత కష్టం.

సింగ :- ఇప్పుడేమొచ్చిందిరా నీకు అంత కష్టం ! మన యెం. యెల్. యే గాడి స్పీచ్ లాగా పొంతన లేకుండా మాట్లడుతున్నావ్ ...

లింగ :- పొంతన లేకా ! అంతేలే ఆ సూరిగాడు ,వాడి బండిని నీ ఇంట్లో పెట్టి ఉంటే నువ్వూ ఇలాగే మాట్లాడుండేవాడివి ...

సింగ :- ఇదిగో మళ్ళీనూ ! సూరిగాడేంటి వాడి బండేంటి , సరిగ్గా చెప్పు

లింగ :- ఆ సూరిగాడు , ఎదో అవసరమైన పని తగిలి పట్నం వెళ్ళాలి అని , వాళ్ళ ఇంటి గేటు సరిగ్గాలేదని చెప్పి , వాడి కొత్త TVS మా ఇంట్లో పెట్టి వెళ్ళాడు . నాలుగు రోజుల తర్వాత వచ్చి చూసుకుని అందులో పోయించిన నాలుగు లీటర్ల పెట్రోల్ లేదని , నా వంకే అనుమానంగా చుసి ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపొయాడు . అలా వెళ్ళినవాడు ఊరుకోక మా వీధి అంతా నేను పెట్రోల్ దొంగనని అందరి చెవులూ కొరికేసాడు . పోన్లే కదా అని సాయం చేస్తే చివరికి నన్ను 'దొంగ ' ని చేసి పోయాడు . ఇంకేం ఉపకారం , ఇంకేం పుణ్యం . అందుకేరా ఉపకారం లాంటి పదాలు వినటానికే బాగుంటాయి .

సింగ :- ఏమిటీ , ఈ మాత్రానికే ? అయినా ఆ సూరిగాడు గురించి తెలుసుగా , మన ఊళ్ళో వాడంత పిసినారి లేడుగా , పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్

లింగ :- నేను పెట్టుకోలేదు బాబు , వాడే ఎదురొచ్చి నన్ను వెర్రివాడిని చేసాడు .

సింగ :- నువ్వు భలే వాడివి , ఇది చాలా చిన్నది . మొన్నటికి మొన్న ఆ లక్ష్మీ టాకీసు వీధి చివర కొత్తగా ఇల్లు కట్టుకున్న ఆ బ్యాంక్ గుమాస్తా తో పోల్చుకుంటే నీకు జరిగింది ఒక లెక్కా .

లింగ :- అబ్బో నాలాంటి వెర్రి బాగులోళ్ళు ఇంకా ఉన్నారా ? చెప్పు చెప్పు .. కరంటు మన ఇంట్లో పొయినప్పుడు , పక్కింట్లో కూడా పొయిందా లేదా చూసుకుని , అక్కడ కూడా పోతే మనం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది నా పరిస్థితి .

సింగ :- ఆ బ్యాంక్ ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడుగా , కట్టుకుని సుమారు ఒక మూడేళ్ళు అయ్యిందా ?

లింగ :- ఆ ఒక మూడు , నాలుగేళ్ళు అయ్యుండొచ్చు .

సింగ :- వాళ్ళ ఇంటిపక్కనే ఈ మధ్య ఇంకో బిల్డింగ్ వేసారు గా , ఆ బిల్డింగ్ వెయ్యటానికి గాను , సామాను ఈ బ్యాంక్ ఆయన ఇంట్లో పెట్టుకుంటాం అని అడిగారు . 'పోన్లే పాపం' అని ఒప్పుకున్నాడాయన . ఇంక అంతే . ఇనుము , చెక్క , మార్బుల్ రాళ్ళు అన్ని ఆయన ఇంటి సందులో పెట్టించారు .

కొన్ని సార్లు ఆయన ఉద్యోగానికి వెళ్ళిన సమయం లో ఆ చెక్క పనులు , మిగతా చిన్న చితకా పనులూ కూడా వాళ్ళ సందులో చేయించేసారు . దానికి కూడా 'పోన్లే పాపం ' అని ఊరుకున్నాడాయన .

చివరికి ఆ సందు నానా భీభత్సం గా తయారయ్యి , వాళ్ళు వదిలేసిన ఇనుము , చెక్క ముక్కలు అప్పుడప్పుడూ కాళ్ళలోకి దిగుతున్నాయని , మొన్ననే ఆ సందూంతా సిమెంటు చేయించి , ఆ సందు గోడ మట్టికొట్టుకుపొయిందని మళ్ళీ వెల్ల వేయించాడు .మొత్తం ఒక అరలక్ష ఖర్చు .

లింగ :- మరి ఆ పక్కింటివాళ్ళు ఏమీ చెయ్యలేదా ?

సింగ :- చేసారు , గృహప్రవేశానికి అరిటాకులు కావాలని వీళ్లనే అడిగి పట్టుకెళ్లారు .

లింగ :- ఎవో కొన్ని ఆకులు పట్టుకెళితే , దానికే ?

సింగ :- ఆకులు మంచివి కావాలని మొత్తం చెట్టునే పీకిపడేసారు .

లింగ :- ఒహో అలా అంటావా ! అయితే తప్పు .

సింగ :- కాని ఇలా ఎవరో ఉపయోగించుకున్నారని , అసలు ఉపకారమే చెయ్యననటం తప్పేమో రా , మనిషిగా పుట్టిన వాడు సాటి మనిషికి సాయం చెయ్యాలి . ప్రతీ రోజూ ఒకలా ఉండదు , ప్రతీ మనిషీ ఒకలా ఉండడు. పారే నదికి నీరు అందివ్వటమే లక్షణం. వికసించే ప్రతి పువ్వుకీ నవ్వులు పంచటమే లక్షణం . మనిషి అని అనుకోవల్సిన ప్రతి వాడికీ ఉపకారం చెయ్యటమే లక్షణం .

లింగ :- అవునా , ఐతే నాకో ఉపకారం చెయ్యి .

సింగ :- చెప్పరా ఏం కావలో .

లింగ :- కొంచెం టైట్ గా ఉంది , ఒక వెయ్యి ఉంటే సర్దు .

సింగ :- వెయ్యా .... (ఎదురుగా పోతున్న ఎవడో మనిషిని పలకరించి ) హలో సుబ్బారావుగారు , ఏంటి నన్ను రమ్మంటారా .. ( అని లింగరాజుకేసి తిరిగి) ఒక్కనిముషం రా లింగా ... అని చెప్పి వడివడిగా జారుకున్నడు సింగరాజు

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2804182768623174975.post-66169909550203636712012-02-01T23:16:00.000-08:002012-02-01T23:16:39.217-08:00స్నేహం
నిర్జీవపు నిశీధి నిండిన హృదయంలో

మరణించిన మనశ్శాంతికి సంజీవని స్నేహం

వెంటనడిచే నీడ కూడా వెక్కిరించే వేళల్లో

కంటతడిని కాచేటి ఓదార్పు స్నేహం

కన్నూ మిన్నూ కానని అహంకారంలో

నిన్ను నీకు తెలియజేసే గుణపాఠం , స్నేహం

పసితనపు ఆటలనుండీ

పండుముదుసలి బోసినవ్వులవరకూ

పంచుకునే చెరిసగమే స్నేహం

ప్రేగు బంధం కాదిది ,

ప్రేమ ఆకర్షణ కానిది

తన నిరుపేద సఖుని పిడికెడు ప్రేమకి

నిలువెల్ల కరిగిన జగన్నాధుని హృదయమిది .

--కాపీరైటు @2012 కళ్యాణ్
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2804182768623174975.post-44677516621399411012012-01-30T23:12:00.000-08:002012-01-30T23:12:24.882-08:00పశువుల కాపరి ఆత్మతత్త్వం
సూర్యోదయానికి ముందు గాఢమైన చీకట్లు మెల్లగా కరుగుతున్న సమయం.

గోదావరి ఒడ్డు దగ్గర ఉదయపు సంధ్యావందనం పూర్తిచేసుకుని , శిష్యులతో వేదవిధానాల గురించి , ఆత్మతత్త్వాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాడు ఒక గురువు .

'గురువుగారు , ఆత్మ అంటే ఏంటి అండి ? ' అంటూ ఒక శిష్యుడు ఆతృతగా అడిగిన ప్రశ్నకి సమాధనంగా వివరణ ఇస్తూ ..

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు గురువు .

వారి సంభాషణ ఈ విధంగా సాగుతూండగా ,ఎదురుగా ఒక పశువులకాపరి అప్పుడేలేచి తన విధులకి తయారవుతూ వీరి సంభాషణ విన్నాడు.

ఆ రోజు రోజంతా అదే విషయం అలోచిస్తూ గడిపాడు ,' సర్వాన్ని సాక్షిగా వీక్షించటం ' అనేది వాడి మనస్సుకి బాగా హత్తుకుపోయింది . అసలు అలా ఉండటం కుదురుతుందా అనే ఆలోచన వాడి మనస్సులో మొలకెత్తింది . ఇదేదో ప్రయత్నిస్తేగాని అర్ధం అవ్వదనుకుని , అప్పటినుండీ అన్నిటినీ కేవలం సాక్షిగా చూడటం మొదలు పెట్టాడు .

మొదట్లో అలా ఉండటం అస్సలు కుదరలేదు. మరీ ముఖ్యంగా భావోద్వేగాల విషయంలోనూ , ఆకలి దప్పుల విషయంలోనూ ఇది అసలు సాధ్యం కాలేదు. ఒక పక్షం రోజుల తర్వాత ఇది మన వల్ల కాదు వదిలేద్దామనుకుని , కర్ర భుజమ్మీద వేసుకుని ఇన్నాళ్ళ తన ప్రయోగం గురించి పునరాలోచన చేస్తూ అల నది వడ్డున కూర్చున్నాడు .

ఎదురుగా ప్రవహిస్తున్న గోదారి అలలు , మెల్లగా వీస్తున్న తెమ్మరలు , నది అలలమీద నుండి వీచే గాలి చప్పుడు అన్నీ ఒక రకమైన ధ్యానానుగుణమైన వాతవరణం కల్పిస్తూ ఉండగా , ఆ పశువుల కాపరి దృష్టి ప్రవహిస్తూన్న నదిమీద పడింది . ఈ క్షణం కనపడిన అల , మరునిముషం అక్కడ ఉండట్లేదు . ఈ క్షణం తనను స్పృశించిన గాలి , మరునిముషం ఎక్కడకి వెళ్తోందో తెలియట్లేదు. కొత్త కొత్త అలలు పుడుతూనే ఉన్నాయి , కొత్త కొత్త అనుభూతులను గాలి కలిగిస్తూనే ఉంది . కాని ఆ నది స్వరూపం , ఆ గాలి స్వరూపం మటుకు మారట్లేదు. అల కొత్తదైనా పాతదైనా , నదికి ప్రవహించటమే లక్షణం , ఇదంతా ఎదో విశ్వరచనకు లోబడి సాగుతూన్నట్టుగా తోచింది ఆ పశువుల కాపరికి.

' గురువుగారు అన్న ఆ ఆత్మ తత్త్వానికి , గోదారి తల్లి బోధిస్తున్న ఈ విశ్వరచనకి ఎమైనా సంబంధం ఉందా ?' అంటూ మళ్ళీ వాడి మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది .

దీర్ఘాలోచనలోన చేస్తూ వాడు సమాధి స్థితిలోనికి జారుకున్నాడు . ఒక 20 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. ఆ పశువుల కాపరి చుట్టూ పుట్టలొచ్చేశాయి .

అంతకుముందు ఆత్మ గురించి చెప్పిన గురువు పరమపదించారు , ఆత్మ గురించి అడిగిన శిష్యుడు ఆ గురువు మఠానికి ఆచార్యుడయ్యాడు.

అలా ఒకనాటి సాయంకాలం , ఆ పశువుల కాపరి సమాధి నుండి మేల్కొని తన స్థితిని గమనించుకుని అక్కడ నుండి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ రెండు దశాబ్దాలుగా , ఏ భావోద్వేగాలూ , ఏ రసస్పందనలు , ఏ ఆకలి దప్పులు లేని స్థితిలో తనను నడిపించిన చైతన్యం ఎదైతే ఉందో , ఆ చైతన్యపు విశ్వరచన యొక్క లిపి కొంత అవగతమయ్యేసరికి తనను తాను మర్చిపోయి ఆ తత్త్వం యొక్క ఆద్యంతాలను నిరంతరం దర్శించాలని తపిస్తూ ముందుకు సాగిపోతున్న అ పశువుల కాపరికి , దూరంగా మైకు నుంచి వినపడుతున్న ఒక పండితుడి మాటలు వినిపించాయి .

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు ఆ వక్త . ఆ వక్త ఎవ్వరో కాదు , పూర్వం ఆత్మ గురించి అడిగిన శిష్యుడు మరియు నేటి ఆచార్యుడు .

తనకు ఆత్మ బోధ చేసిన ఆ గురువు ఙ్ఞాపకం వచ్చి ఒక సారి చూసివద్దామని అటువైపు వెళ్ళాడు ఆ పశువులకాపరి .

ఆ ప్రవచనం వినపడుతున్న సభాప్రాంగణం అంతా విద్యుద్దీపాలతో , మైకుల హోరుతో , భక్తుల వరుసలతో కిట కిటలాడిపోతోంది . అంత మంది లో చినిగిన బట్టలతో , జడలు కట్టేసి , వికృతంగా ఉన్న ఆ పశువులకాపరిని చూసి , ఆ ఆచార్యుని శిష్యవర్గం తరిమివేసింది .

' ఛీ ! శౌచంలేని వాడా , ఇటు రాకు .. పవిత్రమైన ఈ ప్రాంగణం పాడుచెయ్యకు ' అంటూ ఆ ప్రవచనానికి వచ్చిన వారందరూ ఆ పశువులకాపరిని తన్ని తరిమివేసారు .

'నైనం ఛిందంతి శస్త్రాణి ...' అంటూ భగవద్గీతనుండి శ్లోకం మైకు నుంది వినపడుతూంది .

ఒక చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి నిష్క్రమించాడు ఆ పశువుల కాపరి .

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com4tag:blogger.com,1999:blog-2804182768623174975.post-11962551514831833052011-12-13T23:39:00.000-08:002011-12-13T23:39:24.907-08:00వెతుకుతున్నాను ..

వేల అడుగుల నీడల నడుమ,

వేల ఊపిరుల జాడల మధ్య ,

వెన్నంటి వచ్చే నీ వ్యక్తిత్వాన్ని

ఒంటరిగా వెతుకుతున్నాను ..

ఆశల శిఖరపు అంచుల చివర

నిరాశల అగాధపు లోతుల లోపల

విస్తరించిన నీ విశ్వరూపాన్ని

గుర్తుపట్టలేక వెతుకుతున్నను ..

నా ఊపిరి అలలను మోసే కడలివై

నా ఊహల మెరుపులను భరించే మిన్నువై

నా ఇంట్లోనే ఉన్న నిన్ను

ఊరంతా వెతుకుతున్నాను ...

విరహం తొలగి

నిరీక్షణ కరిగి

నిన్ను చూసే ఒక్క క్షణం కోసం

లక్షల యేళ్ళుగా వెతుకుతున్నాను

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-86469791896464804602011-12-07T21:59:00.000-08:002011-12-07T22:44:37.472-08:00నా మొదటి శతకం - కొన్ని పద్యాలు
తెలిసె నేఁడు నాకు తెలుగులో మాధుర్య

మందమైన భావమంకురింప

తెలుగు తరచి చూడఁ దేనె ధారలు జారు

చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

అంబరంబునంటు హర్మ్యాళి నిర్మించె

విశ్వమంత నిలిచి విస్తుబోవ

మనిషి మింటికేగె మరిచి తన భువిని

చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

వింతగొలుపుఁ జూడ విత్తు మొలచు తీరు

నెదుగు నేల గుణముకెదురు నిలిచి

స్థితులు గతులు వెతలు స్థిరచిత్తునాపునే ?

చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

తాతలిడిన యాస్తి తమగొప్పగన్ జూపి

విర్రవీగు చుంద్రు వింత గాను

తెలిసికొనఁగవారు తెలివైన సోమరుల్

చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

కులము పేర ఖలులు కూడఁగట్టు బలిమి

మానవత్మమెదుట మనఁగఁబోదు

తిమిరచయము తొలఁగు దినకరద్యుతి సోక

చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com7tag:blogger.com,1999:blog-2804182768623174975.post-56007856395173313722011-11-23T22:23:00.000-08:002011-11-23T22:24:08.468-08:00ఎదురీత..

దుడుకు అడుగుల శిశిర గాడ్పులకి ,

తల్లి ఒడి నుండి వేరు పడి ..

కొండలనకా , గుట్టలనకా ...

పిల్లగాలులతో కలిసి తిరిగి ....

దుమ్ము ధూళిలో కలిసిపోయి ,

వేల అలజడుల బరువు మోసి,

వేల అడుగుల కింద నలిగి ,

ఇల్లుని విడిచి , తల్లిని మరిచి

ఒక నిర్జీవ కుడ్యపు సన్నని బీటలో చేరి

సేదతీరింది ఒక చిన్ని విత్తనం.

హితులు కరువై , భవిత బరువై

బ్రతికే దారిని ,

ఆ బీటలో పరుచుకున్న నిశీధిలో వెతుక్కుంటూ ..

చిట్టి చేతులతో ఆ గట్టి గోడను

తవ్వుకుంటూ ...

సాగిపోతున్న ఆ విత్తుని

హత్తుకుంది

ఒక ఉదయపు అనాధ మంచుకణం.

బ్రతుకు దొరికింది ..

భవిత నిలిచింది ...

వెతుక్కుంటూ ఒక సూర్య కిరణం

ఆ విత్తనాన్ని పలకరించింది ...

కలిసిరాని కాలంతోనే సాగుతూ

వెక్కిరించిన విధినీడనే మెలుగుతూ , వెలుగుతూ

కొన్నాళ్ళకి ..

గుండెలేని ఆ గోడ పైన

పచ్చని హరితం , వసంతాన్ని స్వాగతించింది ..
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2804182768623174975.post-25027887729550083202011-11-22T21:53:00.000-08:002011-11-23T01:40:00.630-08:00రిక్త హస్తాలతో...

నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..

నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..

దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..

గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..

సాటివారి పై బురదజల్లాలని ..

ఆలోచిస్తూ కాలం గడిపాను ..

వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..

నా చేతులకి నేనే బురద చేసుకున్నాను ...

మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..

ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...

మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..

ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..

రిక్త హస్తాలతో నీ ముంగిట..

యాచిస్తూ నిలిచున్నాను ..

కొత్త ఉదయం ప్రసాదించమని ..

కాస్త ఇంగితం ప్రచోదించమని .

కాపీరైట్@కళ్యాణ్ 2011

Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com8tag:blogger.com,1999:blog-2804182768623174975.post-35969399221785141972011-11-02T07:04:00.000-07:002011-11-23T01:39:44.177-08:00ఆత్మవిశ్వాసం
ఎదురొచ్చే కష్టాలని ,

ఎదిరించడంలోనే ఉంది విజయం ...

కదిలొచ్చే కెరటాలని

చీల్చుకుంటూ పోయేదే పయనం ...

కలిసి రాని కాలపు బలాన్ని తిట్టుకుంటూ వదిలేస్తామా ?

నిబ్బరంగా సంకల్పంతో తట్టుకుని నిలబడలేమా ?

వెన్నుచూపే వారిని , వారి నీడకూడ వెక్కిరిస్తుంది ...

నిన్ను నువ్వే నమ్ముకుంటే , ఆ మిన్ను కూడా వంగి వస్తుంది ...

సమస్యల చీకటి లో ఇంక కన్నీరు తో మిగిలిపోదామా?

గెలుపనే వెలుతురు వెతుకుతూ , చిరునవ్వుతో సాగలేమా ?
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2804182768623174975.post-16600196504774557232011-10-29T04:02:00.000-07:002011-11-23T01:39:29.440-08:00అవ్యక్తం
ఒక ఉదయం,

అటూ ఇటూ విచే అల్లరి గాలులకి,ఎగురుతూ సాగుతూన్న ఒక యెండుటాకు ,'చిటపటా' చప్పుడు చేసుకుంటూ , ఒక వృద్ధ వృక్షపు నీడలోకి వచ్చి ఆగింది ... ఒక సారి ఆ చెట్టుని ఎగా దిగా చూసి ఎదో గుర్తుకుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ..

' మసక బారిన ఙ్ఞాపకాల గదుల్లారా !

మరుపు నిండిన నా మస్తిష్కపు పొరల్లారా !

ఏదో తెలియని అభిమానం ,

ఈ నీడన నాలో చిగురిస్తోంది

ఎన్నో ఏళ్ళ ఒక పరిచయం ,

మళ్ళీ ఇక్కడ పలకరిస్తోంది .

ఎక్కడిదర్రా , ఈ మధుర గానం , ఇంకా ఎదలో మోగుతోంది ..

ఎప్పటిదర్రా , ఈ పులకింతల పరిచయం , తలపుల్లో ఇంకా మెదులుతోంది ? '

అని ప్రశ్నించింది .. అది విని ఆ చెట్టుకి ఉన్న ఆకులు గల గలా నవ్వాయి , 'ఈ ముసలి ఆకుకి రాలిపొయినా ఇంకా మతిమరుపు పోలేదు ' అని కొన్ని పిల్ల గాలులు తమలో తాము గుసగుసలాడుకున్నాయి .. అది విని ఆ ముసలి ఆకు మనసులో మొలిచిన చిన్న పౌరుషపు తాకిడికి తన స్వరం కాస్త హెచ్చించి ఇలా అంది ..

' నవ్వులాటలే మీకు పిల్ల గాలుల్లారా ,

దుడుకు నవ్వులే మీకు కొత్త ఆకుల్లారా ?

ఉడుకు రక్తపు దుడుకు , ప్రాయముడుగినప్పుడు ఉండబోదు

నేటి మీ సూర్యోదయం , నా రేపటి సంధ్య ముందు నిలువబోదు

అప్పుడు మీ బోసినోళ్ళతో వెర్రి నవ్వులు నవ్వుదురులే

ఆనాడు మీ పలుకుల వాడి ఎంతో నేనూ చూస్తానులే '

అని ఉక్రోషంగా పలికింది , ఆ పలుకులకి నొచ్చుకుని కొన్ని పిల్లగాలులు గట్టిగా వీచాయి , ఆ గాలికి , చెట్టు నుంచి మరొక ఆకు రాలి ,కింద ఈ ఆకు పక్కనే పడింది , పడీ పడగానే తన నేస్తమైన ఈ ఎండుటాకుని చూసి ఆనందంతో హత్తుకుంది ,

' బాధల కెరటాలు , సంతోషపు ముత్యాలు

గంభీరంగా మోసే కడలే ఈ కాలం

కలిసీ కలువని భూమీ ఆకాశపు

సరిహద్దు రాజ్యమే ఈ కాలం

ఆయువయ్యిందని , ఊపిరాగిందని , రాలిపొయిన నా మనసుకు

మరునిముషం లోనే నిన్ను చూపించి చిగురింపజేసింది ఈ కాలం '

అని మురిసిపోతూ తను ఎవ్వరో ఆ ఎండుటాకుకి ఙ్ఞాపకం చేసింది , దూరంగా ఎప్పుడో తను రాలిపొయినప్పుడు ఏర్పడిన గుర్తుని చూపించింది .అప్పుడు గుర్తొచింది ఆ ముసలికి , అది తన ఇల్లని , ఆ చెట్టు తన అమ్మని ... తను రాలిపోయినా ఇంకా తను వదిలి వెళ్ళిన గుర్తులని మోస్తున్న తన తల్లి ని చూసి ..

'గుండె తడి అయినా

మనసు చెమ్మగిల్లినా

చుక్క కన్నీరయినా మిగలని

అలసిపొయిన ఎండుటాకుని '

అని బాధ పడుతూంటే , చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై ఆ ఎండుటాకుని తడిపింది ..
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com4tag:blogger.com,1999:blog-2804182768623174975.post-30863074476742131612011-10-27T03:42:00.000-07:002011-11-23T01:38:59.957-08:00నా (పగటి)కలల సుందరికి ..
(సినెమాలు చుస్తూ , ఎవేవో ఊహించుకుంటూ పగటి కలలు కనే , ఆ అమాయకత్వం , కాలక్రమేణా కనుమరుగవుతుంది , కాని ఆ ఙ్ఞాపకాలు మాత్రం మిగిలిపొతాయి .. )

కలవై కనులకు కనిపించావు

చిరునగవై పెదవికి పరిచయమయ్యావు

ఊహల అలపై ఊయలలూపి

కొత్త తీరాలని మనసుకి చూపి

ఏ ఆవిరి తెరల మాటుకు మాయమయ్యావు?

ఒక మంచుశిల్పానివై మిగిలిపొయావు ..

పగటికలల నీ ధ్యానం లో , నా ప్రాయం

మధుర ఙ్ఞాపకమై మిగిలిపొయింది

పరిణితి అనే మౌనంలో , నా కర్తవ్యం

ఒక చేదు నిజంగా ఎగసి వచ్చింది .
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2804182768623174975.post-37813016686558493252011-10-27T02:58:00.000-07:002011-11-23T01:41:01.909-08:00ఒక రైతు కథ
తూర్పు తెల్లవారుతుండగా , గూళ్లలోని పక్షిపిల్లల సవ్వడులు పల్లెలో పరుచుకుంటూ , తెల్లవారిందని అందరికీ తెలియచేస్తూ ఉండగా , పెద్ద కరణం గారి ఇంటి సందుకి ఆనుకుని ఉన్న చిన్న బురద దారి గుండా సాగుతున్నాయి రాములు అడుగులు ...

'ఏరా రాముడూ , పొలానికా ? '

ఏదో పరధ్యానం లో ఉన్న రాములుని ,అప్పుడే నిద్ర లేచి , చెంబు పట్టుకుని ఎదురు వస్తూ పలకరించాడు సూరి .

నోటితో ఏమీ చెప్పకుండానే అవునన్నట్టు తలూపాడు రాములు.

'ఏంటీడు , ఇలా ఉన్నాడు ?' అని మనసులో అనుకుంటూనే ,'మనకెందుకులే ఈ సమయంలో ' అనుకుని వడి వడి గా ముందుకు వెళ్ళిపొయాడు సూరి.

దూరంగా రామాలయం మైకు నుంచి పూజరి గారి వేద పాఠం వినపడుతోంది , ఆ మంత్రాలేంటో అర్ధంకాకపోయినా , చిన్నప్పటినుంచి ఉన్న అలవాటు వల్ల చేతులు అప్రయత్నంగానే అటువైపు తిరిగి నమస్కారం పెట్టాయి , కళ్ళు ముసుకుని 'జై శ్రీరాం ' అనుకుని మళ్ళీ తన నడక కొనసాగిస్తున్నడు రాముడు.

కొద్దిగా ముందుకు సాగగానే , ఆ మంత్రాల మహిమ వల్లనేమో , తప్పుచేస్తున్న భావం మొలకెత్తింది రాముడిలో , నెమ్మదిగా ఙ్ఞాపకాలు దొంతరలుగా కళ్ళ ముందు కదలాడసాగాయి ...

చిన్నపుడు ఇలాగే తెల్లవారుతుండాగానే , తన తండ్రి తనని పొలానికి తీసుకువెళ్ళేవాడు . దారిలో రాముడి గుడి ముందు ఆగి ఒక దణ్ణం పెట్టి , సన్నగ తనలో తాను ఒక పాత పాట పాడుకుంటూ , మధ్య మధ్యలో తన పంచె బొడ్దు లో దాచుకున్న చుట్టల్ని తడుముకుంటూ , వచ్చేపోయేవాళ్ళని మనసారా పలకరిస్తూ , వడివడిగా పెద్ద పెద్ద అంగలేస్తూ సాగిపొతున్న తన కన్నతండ్రి , తన కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాడు . ఎంత కష్టమైనా నవ్వుతూ ధైర్యంగా ఎదుర్కొన్న తన తండ్రిని గుర్తుచేసుకుంటూంటే కొంచెం గర్వం , కొంచెం బాధ కలిగాయి రాములుకి .

అలా ఙ్ఞాపకాలని నెమరువేసుకుంటూ నాలుగు అడుగులు ముందుకు వేయగానే , పూజరిగారి ఇంటి ముందు కళ్ళాపు జల్లుతున్న పనిమనిషి కనపడింది .

వెంటనే తన తల్లి గుర్తుకు వచ్చింది. తెల్లవారకుండానే బయల్దేరి నాలుగిళ్ళల్లో పాచిపని చేసి , వాళ్ళ ఇంటెడు సామాన్లూ తోమి ,బట్టలు ఉతికి , మళ్ళీ వెనక్కి వచ్చి తన తండ్రికి చద్దన్నంలో ఉల్లిపాయముక్క , ఒక పచ్చిమిరపకాయ పెట్టి , అది తిని పొలానికి బయల్దేరుతున్న తన తండ్రిని గుమ్మంవరకూ వచ్చి సాగనంపే ముత్తైదువు తన తల్లి , అలసట అన్నది ఎన్నడూ మొహం లో చూపించని తన తల్లిని తలుచుకుంటూంటే అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి రాములుకి .

మనసులో తప్పు చేస్తున్న ఆలోచనలు మళ్ళీ లేచాయి . గట్టిగా తన తువ్వాలు చాటూన దాచిన పురుగులమందుని అదిమిపట్టుకున్నాడు.

'మధ్యాహ్నం త్వరగా రండి ,ఈ రోజు ' అన్నం ' వండుతున్నాను ' తన భార్య తనతో ఇందాక పొలానికి బయల్దేరే ముందు అన్నమాటలు గుర్తుకొచ్చాయి . చాల రోజుల తర్వాత తన ఇంటిలో 'అన్నం ' వండబడుతోంది , అది కూడ తన భార్య వంటి మీద ఉన్న ఆఖరి బంగారపు గాజు అమ్మిన డబ్బుతో .

'పొలానికి తీసుకున్న అప్పు , వారం లో కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తాం ' అని వారం క్రితం బ్యాంక్ వారి మాటలు కూడా గుర్తుకొచ్చాయి.

భారంగా నడుస్తున్న రాములుకి దూరంగా తన పొలం కనపడుతోంది .

నిట్టురుస్తూనే తన పొలం చేరుకుని , బీటలు తీసిన తన పొలం మధ్యలో కూర్చున్నాడు . ఎన్నో ఆలోచనలతో మనసంతా గందరగోళంగా ఉంది . అప్పటివరకు దాచిన పురుగులమందుని తీసి పక్కనపెట్టి , 'ఎప్పుడు తాగాలా ?' అని ఆలోచిస్తూ మళ్ళీ తన గతంలోకి వెళ్ళిపొయాడు .

తన పొలం పక్కనే ఉన్న అయిదు ఎకరాల యజమాని , తన ప్రాణ స్నేహితుడి ఆఖరి మాటలు గుర్తుకొచ్చాయి ..

' ఓడిపోయాను రా రాముడూ ! నేలని నమ్ముకుని బ్రతుకుతున్న మనకి , నమ్మి కొలిచిన దేవుడూ , నమ్మి ఓటేసిన నేతలూ , ఎవ్వరూ నీళ్ళివ్వలేదు . నీళ్ళైతే దొరకలేదు గాని , పురుగులమందు మటుకు అప్పు మీద దొరికింది . నేను చేతకానివాడ్నే గాని, పిరికివాడిని అని మాత్రం అనుకోవద్దు ' అని రాసి పంటకోసమని కొన్న పురుగులమందు తాగిన తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు .

గత ఎన్నికలలో ' మీ నీళ్ళకోసం నా ప్రాణలైనా ఇస్తా ' అని ప్రతిఙ్ఞ చేసిన ఎమ్మెల్యే గుర్తుకొచ్చాడు .

వందలకొద్దీ ఆత్మహత్యలు చేసుకున్న తన లాంటి సన్నకారు రైతులు గుర్తుకొచ్చారు , ఆవేశం , ఆక్రోశం , అసహాయత ఇలా భిన్నమైన భావాల మధ్య భార్య 'అన్నం ' వంట ఙ్ఞాపకం వచ్చింది .

ఆఖరిసారి అన్నం తిని చచ్చిపోదామనిపించి , పురుగులమందుని మళ్ళీ జాగ్రత్తగా తువ్వాలు వెనక దాచి , నెమ్మదిగా ఇంటివైపుకి నడక సాగించాడు ..

అలా తన ఇంటి దరిదాపులలోకి చేరుకున్నాకా , ఆమడ దూరం లో ఏదో ఆగి ఉన్న కారు గమనించాడు.

ఎవరో పెద్దవాళ్ళు , తన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నారు , ఎవో కాగితాలు , ఫైళ్ళు పట్టుకుని ఉన్నారు వాళ్ళు .

'ఏమి జరుగుతోందో ' అని కుతూహలం ఉన్నా ,' మనకెందుకులే ' అని సర్దిచెప్పుకుని , తన ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని భార్యకి చెప్పి , కాళ్ళూ చేతులూ కడుక్కుని కంచం ముందు కూర్చున్నాడు . భార్య చూడకుండా పురుగులమందు కొంచం పప్పులో కలిపి తాను వేసుకుని , తను లేకపొతే తన భార్య అనాధ అయిపొతుందని కొంత తన భార్య కి కూడా వేసి , తృప్తి గా కడుపారా తిని భుక్తాయసం తో ఆరుబయటకి వచ్చి కూర్చున్నాడు రాముడు .

నిత్యం ఎదో పాటలు పాడుతూ పని చేసే తన భార్య ,వంటింటిలోకి వెళ్ళి , అరగంట అయినా ఏమీ శబ్దం చేయకపోయేసరికి 'మందు పని చేస్తోందేమొ ' అని ఆనందపడుతున్న రాముడికి ఎదురుగా ఇద్దరు పెద్దమనుషులు నిలుచున్నట్లు కనపడ్డారు ... చూపు నెమ్మదిగా మసక బారుతోంది ... ఆఖరి క్షణాలు వస్తున్నట్టు తెలుస్తోంది ... ఇంతలో ఆ పెద్దమనుషుల్లో ఒకరు ..

' ఇక్కడ ప్రభుత్వం ఒక శెజ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది , కాబట్టి మీ భూమి ప్రభుత్వ ధరల ప్రకారం మేము కొంటాం , ఇంకా మీకు ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తాం ..'' అంటూ ఇంకా చెప్పబోతున్నవాళ్ళకి ఎదురుగా కుప్పకూలిపోతూ , చిద్విలాసంగా ఆఖరిసారి చిరునవ్వు నవ్వుతూ కనపడ్డాడు రాముడు.

ఊరు మూగపొయింది .

మరొక సారి సూర్యుడు భారంగా అస్తమించాడు.

కొసమెరుపు :- పట్నం లో ఉన్న పెద్దాసుపత్రి లో మెల్లగ కళ్ళు తెరిచాడు రాముడు , పక్కనే ఉన్న మంచం మీద ఉంది తన భార్య , అప్పుడప్పుడే తను కూడా కళ్ళు తెరుస్తోంది. తన పక్కనే నుంచుని ఉన్న సూరిగాడు , కళ్ళనీళ్ళతో రాముడి పక్కకు వచ్చి , చడామడా నాలుగు తిట్టి , కొట్టినంత పనిచేసి , ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ పని తలపెట్టనని వొట్టు పెట్టించుకున్నాడు. తన పొలం కొనడానికి వచ్చిన ఆఫీసర్లే తనని కారు లో తీసుకొచ్చి ఆసుపత్రి లో చేర్పించారని చెప్పాడు .

'మరి ఆ పురుగులమందు ?' అని రాముడు అమాయకంగా అడిగాడు ..

'నీ అదృష్టం , అది కల్తీ మందు ..., పంటకే కాదు మనుషులకి కూడ పనిచెయ్యదు ' చెప్పాడు సూరి.
Kalyanhttp://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.com2