అవినీతి ,అరాచకత్వపు
గంజాయి మొక్కల వ్యవసాయంలో
స్వచ్ఛమైన ప్రజస్వామ్యమనే
తులసి మొక్కే కలుపు మొక్క
స్వలాభం , దోపిడీ భావమనే
ఉత్తుంగ తరంగ మహార్ణవంలో
ఎంత వెతికినా దొరకనిదే
చిత్తశుధ్ధి అనే చిన్ని కెరటం
విలువల వలువల ద్రౌపదీ పర్వంలో
వింత చూస్తున్న అందరం కౌరవులమే
అవినీతి చరిత్రలు గల కసాయిలను,
అనుసరించే వారందరం వెర్రి గొర్రెలమే
ఇంత చిక్కని విషసంద్రంలో
అంతు చిక్కని అల్లకల్లోలంలో
కాస్త ఇంగితమే అమృతపు చుక్క
అనంతమైన చీకట్లను తరిమేది
ఆలోచన అనే వేగుచుక్క
గంజాయి మొక్కల వ్యవసాయంలో
స్వచ్ఛమైన ప్రజస్వామ్యమనే
తులసి మొక్కే కలుపు మొక్క
స్వలాభం , దోపిడీ భావమనే
ఉత్తుంగ తరంగ మహార్ణవంలో
ఎంత వెతికినా దొరకనిదే
చిత్తశుధ్ధి అనే చిన్ని కెరటం
విలువల వలువల ద్రౌపదీ పర్వంలో
వింత చూస్తున్న అందరం కౌరవులమే
అవినీతి చరిత్రలు గల కసాయిలను,
అనుసరించే వారందరం వెర్రి గొర్రెలమే
ఇంత చిక్కని విషసంద్రంలో
అంతు చిక్కని అల్లకల్లోలంలో
కాస్త ఇంగితమే అమృతపు చుక్క
అనంతమైన చీకట్లను తరిమేది
ఆలోచన అనే వేగుచుక్క
- Copyright@2012 Kalyan
చక్కగా రాశారండి, అభినందనలు, అన్నీ వేరువేరు కదా....., కాదా?
ReplyDeleteకృతఙ్ఞతలండి. అన్నీ ఒకటేనండి , వేరు కాదు :-)
Deleteవినాయకచవితి శుభాకాంక్షలండి,
ReplyDeleteఆలస్యంగా చెబుతున్నా , ఏమీ అనుకోవద్దు :-) మీకు కూడా వినాయక చవితి శుభాకంక్షలు
Delete